Amazon Prime : ఈ లేటెస్ట్ సినిమాలు చూశారా..?
కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లన్నీ మూసేశారు. ఇప్పటికీ ఇంకా ఓపెన్ కాలేదు. ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినప్పటికీ టికెట్ రేట్ల కారణంగా థియేటర్ యాజమాన్యాలు థియేటర్లను తెరవడం లేదు. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా ఉంటుందనే భయంతో కూడా థియేటర్లను తెరవడం లేదు. దీంతో దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఇలా రీసెంట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో తప్పక చూడాల్సిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాలిక్ - మలయాళం : భూ కబ్జా, రాజకీయ అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మత సమస్యల కాన్సెప్ట్ ను కూడా టచ్ చేశారు. ఫహద్ ఫాజిల్ తన నటనతో సినిమా స్థాయిని మరింత పెంచేశాడు.
తూఫాన్ - హిందీ : స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో స్ట్రగుల్ అయ్యే ఓ బాక్సర్ పాత్రలో ఫర్హాన్ అక్తర్ కనిపించారు.
Sara’s - మళయాలం : హీరోయిన్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఒక అమ్మాయి తన లక్ష్యం చేరుకోవడానికి పడే తపన, ఫీమేల్ ఇష్యూస్, పెళ్లి తరువాత తనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు మొత్తం అన్నింటినీ ఈ సినిమాలో చూపించారు. ప్రతీ అమ్మాయి ఈ కాన్సెప్ట్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు.
నారప్ప - తెలుగు : తమిళంలో వచ్చిన 'అసురన్' సినిమాకి రీమేక్ ఇది. యాజిటీజ్ కాపీ, పేస్ట్ చేసినప్పటికీ వెంకీ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కాబట్టి కచ్చితంగా ఈ సినిమాను చూడాల్సిందే!
ఆనుమ్ పెన్నుమ్ - మలయాళం : మూడు డిఫరెంట్ స్టోరీలతో తెరకెక్కించిన ఈ వెబ్ ఫిలింలో పార్వతీ తిరువోత్, రోషన్ మాథ్యూల పెర్ఫార్మన్స్ హైలైట్ గా నిలిచింది.
కోల్డ్ కేస్ - మలయాళం : ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. పృథ్వి రాజ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ను కూడా మిక్స్ చేశారు.
సార్పట్ట - తమిళం : ఆర్య నటించిన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బ్రిటిష్ పరిపాలన తరువాత ఒక విలేజ్ లో బాక్సింగ్ చుట్టూ తిరిగే స్పోర్ట్స్ నేపథ్యంలో ఎంతో ఎంగేజింగ్ గా సినిమాను తెరకెక్కించారు. ప్రైమ్ లో ఈ సినిమా తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది.