In Pics Messi Leaves Barcelona: మెస్సీ షాకింగ్ నిర్ణయం... 21 ఏళ్లుగా ఆడుతున్న బార్సిలోనా క్లబ్‌కు గుడ్ బై
ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 21 ఏళ్లుగా ఆడుతున్న బార్సిలోనా క్లబ్‌కు గుడ్ బై చెప్పాడు.
2000వ సంవత్సరంలో యువ ఆటగాడిగా బార్సిలోనా క్లబ్‌లో అడుగుపెట్టిన మెస్సీ.. అప్పటి నుంచి అదే క్లబ్‌కు ఆడుతున్నాడు.
ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన వ్యత్యాసాలు, కొన్ని లీగ్‌ల నిబంధనల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో వీరి ఒప్పందం కుదరలేదు. ఈ కారణంగా మెస్సీ రెండు దశాబ్దాల తర్వాత బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్‌కు గుడ్ బై చెప్పాడు.
మెస్సి తమ క్లబ్ నుంచి వెళ్లిపోతున్న నేపథ్యంలో అతడి భవిష్యత్తు గొప్పగా కొనసాగాలని బార్సిలోనా క్లబ్ ఆకాక్షించింది. ఇన్నేళ్ల పాటు తమ క్లబ్ తరపున సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
బార్సిలోనా క్లబ్‌కు 2000వ ఏడాదిలో 13 ఏళ్ల వయసులో తొలిసారి కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన మెస్సీ.. ఇప్పటి వరకూ 788 మ్యాచ్‌లు ఆ క్లబ్ తరఫున ఆడాడు.
బార్సిలోనా తరఫున అత్యధిక గోల్స్, మ్యాచ్‌లు మెస్సీ పేరు మీదే ఉన్నాయి.