CSK vs GT IPL 2023 Final: ఆడిన ప్రతి ఫైనల్ గెలిచిన పాండ్య - 11వ ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్న ధోనీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన రెండో టీమ్ చెన్నై సూపర్ కింగ్స్! మంచి ఆటగాళ్లు దొరకడం, గొప్ప క్రికెట్ బుర్ర 'ఎంఎస్ ధోనీ' ఉండటమే వారి లక్! ఇంకో ట్రోఫీ గెలిచి ముంబయి రికార్డును సమం చేయాలని సీఎస్కే కోరుకుంటోంది.
ఎంఎస్ ధోనీకి ఇది 11వ ఐపీఎల్ ఫైనల్. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 10 సార్లు, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఒకసారి ఫైనల్ ఆడాడు. ఇందులో నాలుగుసార్లు విజేతగా అవతరించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021లో విజేతగా అవతరించింది. ధోనీ విజయవంతంగా వ్యూహాలు అమలు చేశాడు. మిగతా సమయాల్లో రన్నరప్‌గా నిలిపాడు.
అన్ని విభాగాల్లో పటిష్ఠమైన ఆటగాళ్లతో టీమ్‌ను సెటప్ చేయడమే గుజరాత్ సక్సెస్ మంత్రం! బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, సపోర్ట్ స్టాఫ్, టెక్నికల్ టీమ్‌ను అద్భుతంగా ఎంపిక చేసుకుంది. అందుకే మొదటి సీజన్లోనే ట్రోఫీ గెలిచింది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇప్పటి వరకు ఐదు ఐపీఎల్ ఫైనళ్లు ఆడాడు. ఐదుకు ఐదూ గెలిచాడు. ముంబయి ఇండియన్స్ చివరిగా గెలిచిన నాలుగు సార్లూ అతడు కీలకంగా మారాడు.
ముంబయి ఇండియన్స్ ట్రోఫీ గెలిచిన 2015, 2017, 2019, 2020లో హార్దిక్ పాండ్య ఆడాడు. ఇక 2022లో కెప్టెన్‌గా గుజరాత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లి విజయం సాధించాడు. మరి ఆరో ఫైనల్ గెలుస్తాడా చూడాలి.