Tokyo Paralympics 2020: ఘనంగా ముగిసిన విశ్వ క్రీడలు... భారత్ అదరహొ
విశ్వ క్రీడలు టోక్యో పారాలింపిక్స్ ఘనంగా ముగిశాయి. ఆదివారం సాయంత్రం ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ క్రీడల్లో భారత్ 19 పతకాలు సాధించింది. 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.
968 నుంచి పారాలింపిక్స్‌లో పోటీపడుతోన్న భారత్.. 2016 వరకూ మొత్తం 12 పతకాలు మాత్రమే సాధించగా.. ఇప్పుడు ఏకంగా 19 పతకాలు రావడం విశేషం.
ముగింపు వేడుకల్లో షూటర్ అవని లేఖరా భారత పతాకధారిగా వ్యవహరించి.. భారత్ బృందాన్ని నడిపించింది.
పతకాల పట్టికలో భారత్ 24వ స్థానంలో నిలిచింది. 2012 లండన్ పారాలింపిక్స్‌లో భారత్‌కి ఒకే ఒక పతకం దక్కగా.. 2016 రియో పారాలింపిక్స్‌లో ఆ సంఖ్య 4కి చేరింది.
అవని లేఖరా (షూటింగ్), సుమిత్ అన్టిల్ (జావెలిన్ త్రో), మనీశ్ నర్వాల్ (షూటింగ్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), కృష్ణ నగర్ (బ్యాడ్మింటన్) స్వర్ణ పతకాలు గెలిచారు.
నేషనల్ స్టేడియంలో కన్నులపండువగా జరిగిన ముగింపు ఉత్సవానికి జపాన్ యువరాజు అకిషినో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
4045 మంది అథ్లెట్లు బరిలో దిగిన ఈ పారాలింపిక్స్‌లో 207 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. బ్రిటన్ (124), అమెరికా (104) తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.
‘పారాలింపిక్స్‌తో ప్రపంచం స్ఫూర్తి పొందింది. భిన్నమైన వైకల్యాలు కలిగిన వారు ఇక్కడ రాణిస్తారు’ అన్న సందేశంతో ముగింపు కార్యక్రమాలను రూపొందించారు.