India Medal Winners, Tokyo Olympics: మ్యాజికల్ 7... టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు
పీవీ సింధు: రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన తొలి భారత క్రీడాకారిణి పీవీ సింధు. కాంస్య పోరులో సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్జియావో పై విజయం సాధించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనీరజ్ చోప్రా: అథ్లెటిక్స్‌లో పతకం సాధించాలన్న 100ఏళ్ల భారత కలను జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా నెరవేర్చాడు. ఈటెను 87.58మీటర్లు విసిరి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో స్వర్ణ పతకం అందించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
పురుషుల హాకీ జట్టు: 41ఏళ్ల తర్వాత భారత పురుషుల జట్టు ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. కాంస్యం కోసం జరిగిన పోరులో భారత్ 5-4తేడాతో జర్మనీని ఓడించింది.
మీరాబాయి చాను: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించింది మీరాబాయి చాను. 21 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం అందించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం అందించిన తొలి క్రీడాకారిణి చాను.
బజ్రంగ్ పునియా: ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడిన బజ్రంగ్ పునియా బంగారు పతకం సాధిస్తాడని అనుకున్నారు. కానీ, ఓ పోటీలో మోకాలి నొప్పిని భరిస్తూ ఆడి ఓడిపోయాడు. దీంతో అతడు కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.
లవ్లీనా: 23 ఏళ్ల బాక్సర్ లవ్లీనా ఒలింపిక్స్ ఆడిన తొలిసారే పతకం సాధించింది. విజేందర్ సింగ్, మేరీ కోమ్ తర్వాత భారత్ కు బాక్సింగ్‌లో పతకం అందించింది ఈమె.
రవికుమార్ దహియా: ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రజతం సాధించిన రెండో రెజ్లర్ రవికుమార్ దహియా. 57 కేజీల విభాగంలో రవి పతకం సాధించాడు.