ICC U19 World cup 2022: యువీ, కోహ్లీ, ఉన్ముక్త్ చంద్, పృథ్వీషా.. ఈ సారి స్టార్ ఎవరు? ముందేం జరిగింది?
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ టోర్నీల్లో టీమ్ఇండియాకు తిరుగులేదు. 2000 సంవత్సరం నుంచి ఈ ఆధిపత్యం మొదలైంది. కెప్టెన్ మహ్మద్ కైఫ్ దీనికి అంకురార్పణ చేశాడు. యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీమ్ఇండియా 2008లో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి విజేతగా ఆవిర్భవించింది. కుర్ర విరాట్ కోహ్లీ అప్పుడే కెప్టెన్‌గా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. రవీంద్ర జడేజా సైతం అదే జట్టులో ఉన్నాడు. 2012లో టీమ్ఇండియా మూడో కప్పు ఒడిసిపట్టింది. కెప్టెన్ ఉన్ముక్తు చంద్ తన బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాడు.
రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో 2018లో టీమ్ఇండియా నాలుగోసారి గెలిచింది. పృథ్వీ షా కెప్టెన్సీ ఆకట్టుకుంది. ఇక ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పరుగుల వరదను మర్చిపోలేం. ఎక్కువమంది స్టార్లను పరిచయం చేసింది ఈ ట్రోఫీ. యశ్‌ధుల్ సారథ్యంలో టీమ్ఇండియా తాజా ప్రపంచకప్‌లో ఫైనల్ చేరుకుంది. ఇంగ్లాండ్‌తో ఫైనల్లో తలపడనుంది. యశ్‌ధుల్, షేక్ రషీద్ వంటి ఆటగాళ్లు కీలకంగా ఉన్నారు. గతేడాది త్రుటిలో కప్పు మిస్సైన భారత్ ఈసారి గెలుస్తుందా? చూడాలి.