Ravindra Jadeja: విజేతగా వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్
భారతీయుల 17 ఏళ్ల కల సాకార్యమైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు విజేతగా అవతరించింది. తమ కల నెరవేరడంతో టీమిండియా సీనియర్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటనలు చేశారు. వారిలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు.
తన రిటైర్మెంట్ ను సోషల్ మీడియా లో ప్రకటించిన జడేజా మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నానన్నాడు. దేశం కోసం తాను ఎల్లప్పుడూ అత్యుత్తమ సేవలు అందించానని తెలిపాడు.
టీ20 వరల్డ్ కప్ నెగ్గడం ద్వారా తన స్వప్నం సాకారమైందని, ఈ విజయం తన అంతర్జాతీయ కెరీర్ లో అత్యుత్తమమైనది అన్నాడు జడ్డూ.
ఐపీఎల్లోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు రవీంద్ర జడేజా. ఈ జట్టుకు స్పెషల్ ఫాన్ బేస్, జట్టులో ఆటగాళ్ళకు ప్రత్యేక నిక్ నేమ్స్ ఉంటాయి. సిఎస్కే అభిమానులు జడ్డూ కి పెట్టిన పేరు 'క్రికెట్ దళపతి'
తన కెరీర్ లో ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఉల్లాసభరిత క్షణాలు ఉన్నాయని, వాటిని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. టీ ఫార్మెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినా వన్డేలు, టెస్టుల్లో మాత్రం భారత్ తరఫున మెరుగైన ప్రదర్శనను కొనసాగించనున్నట్లు జడేజా వెల్లడించాడు.
35 ఏళ్ల జడేజా తన కెరీర్ లో ఇప్పటివరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడాడు. 515 పరుగులు, 54 వికెట్లు తీశాడు.