ICC Champions Trophy 2025: టీమిండియా విన్నింగ్ మూమెంట్ సెలబ్రేషన్స్ ఫొటోస్ చూశారా.. వరుసగా రెండో ఐసీసీ టోర్నీ కైవసం
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2002, 2013లో విజేతగా నిలిచిన భారత్, ఈ ట్రోఫీని రికార్డు స్థాయిలో మూడోసారి కైవసం చేసుకుని సత్తా చాటింది.
కివీస్ బౌలర్ రూర్కే బౌలింగ్ లో 49వ ఓవర్ చివరి బంతిని జడేజా బౌండరీకి తరలించడంతో సంబరాలు మొదలయ్యాయి. ఇటీవల టీ20 వరల్డ్ కప్ అనంతరం జరిగిన రెండో మేజర్ ఐసీసీ టైటిల్ ను భారత్ కైవసం చేసుకుంది.
భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఒకరినొకరు హగ్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. తాము విజయం సాధించామంటూ గాల్లోకి పంచులు విసిరారు.
దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయినా, కెప్టెన్ గా జట్టును విజయపథంలో నడిపించి విజేతగా కప్ అందించాడు.
చివర్లో ఉత్కంఠ నెలకొన్న సమయంలో రాహుల్, జడేజా జాగ్రత్తగా ఆడి భారత్ కు విజయాన్ని అందించగా దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్రీజులో ఉన్న బ్యాటర్లు రాహుల్, జడ్డూల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.