MomijiNishiya: 13 ఏళ్లకే స్వర్ణం సాధించేసింది
జపాన్ తరఫున స్వర్ణం సాధించిన పిన్న వయస్కురాలు మొమిజి నిషియా
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశ్వక్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల స్కేట్ బోర్డింగ్‌లో నిషియా స్వర్ణం సాధించింది. ఒలింపిక్స్‌లో పసిడి పట్టిన పిన్నవయస్కురాలైన జపాన్ అథ్లెట్‌గా రికార్డులకెక్కింది.
స్వర్ణం సాధించే రోజుకి మొమిజి వయస్సు 13 ఏండ్ల 330 రోజులు.
స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్‌లో నిషియా మొత్తంగ 15.26 పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచింది.
1936 ఒలింపిక్స్‌లో యూఎస్ డైవర్ మర్జోరీ గెస్ట్రింగ్ (13 ఏండ్ల 268 రోజులు) తర్వాత వ్యక్తిగత స్వర్ణం సాధించిన చిన్న వయసు అథ్లెట్‌గా మొమిజి రికార్డుకెక్కింది.
ఒలింపిక్స్ చరిత్రలో స్వర్ణం పట్టిన రెండో చిన్న వయసు అథ్లెట్‌గా నిలిచింది. ఇదే స్కేట్బోర్డింగ్ పోటీలో రజతం సాధించిన బ్రెజిల్ అథ్లెట్ రైసా లీల్ వయసు కూడా 13 ఏండ్ల 203 రోజులు కావడం విశేషం.