Yamagandam: 24 గంటలలో యమధర్మరాజుకు సంబంధించిన సమయం ఇది, పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!
పంచాంగంలో రాహుకాలంతో పాటూ యమధర్మరాజుతో ముడిపడి ఉన్న అశుభ సమయం కూడా ఉంది. దీనిని యమగండం అని పిలుస్తారు. ఇది ప్రతిరోజూ దాదాపు 1.5 గంటల వ్యవధిలో ఉంటుంది.
యమగండంలో ప్రారంభించిన పనులకు ఆటంకాలు కలుగుతాయని లేదా మంచి ఫలితం ఉండదని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రంలో యమగండం మృత్యు సూచిక, ఆటంకం, భయం , అశుభానికి కారణమని భావిస్తారు.
యమగండం సమయంలో నిర్లక్ష్యంగా వాహనం నడపడం మృత్యువును ఆహ్వానించడమే, ఎందుకంటే ఈ సమయంలో యమధర్మరాజు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో జరిగే ప్రమాదం మరణానికి సమానమైన బాధను కలిగిస్తుందని చెబుతారు.
సంతానం కలగడం దేవుడిచ్చిన వరం. కానీ, ఏదైనా కారణం వల్ల యమగండంలో సంతానం కలిగితే తగిన శాంతి చేయించాలి..లేదంటే వారు బతికి ఉన్నంతకాలం గ్రహణంలానే ఉంటుంది వారి జీవితం
యమగండ కాలంలో వివాహం, గృహ ప్రవేశం, నిశ్చితార్థం వంటి శుభ కార్యాలు చేయకూడదు..కాదు కూడదని ఆచరిస్తే దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.
యమగండ కాలంలో మరణానికి సంబంధించిన సంస్కారాలు, అంత్యక్రియలు వంటివి మాత్రమే చేస్తారు, ఎందుకంటే ఇది జీవిత చక్రం ముగింపునకు చిహ్నం.