Inspirational Spiritual Thoughts : ఉదయం నుంచి రాత్రి వరకు ఆధ్యాత్మిక దినచర్య ఎలా ఉండాలి?
సరియైన దినచర్య కలిగిన వ్యక్తి మానసిక , శారీరక ఆరోగ్యం బావుంటుంది. ఆధ్యాత్మిక గురువు, యోగి పరమహంస యోగానంద తన పుస్తకం యోగి కథామృతం లో ఆధ్యాత్మికత పరంగా మీ దినచర్య ఎలా ఉండాలో వివరించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రతిరోజు ఉదయం లేచి మీరు ఆ భగవంతుడిని ప్రార్థించండి. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని జయించే శక్తి మీకు ఉందని విశ్వశించండి.
రోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయండి, చదవండి, ధ్యానం చేయండి, దేవుడికిని ప్రకృతిని ప్రేమించండి. ప్రతి పనిని ప్రశాంతంగా చేసుకోండి
రోజూ ఉదయంతో పాటూ రాత్రి నిద్రకు ఉప్రమించేకూడా ధ్యానం చేయండి. ధ్యానం మాత్రమే సత్యం , అసత్య ఆలోచనల మధ్య ఆలోచించే అర్థం చేసుకునే శక్తిని ఇస్తుంది.
అనవసరంగా మీ విలువైన శక్తిని వృధా చేయకుండా ఉండండి. మౌనంగా భోజనం చేయండి, మౌనంగానే పని చేయండి ఎందుకంటే దేవునికి మౌనం అంటే ఇష్టం.
ప్రతి రాత్రి నిద్రపోయే ముందు కాసేపు కూర్చొని రోజంతా చేసిన పనులను గుర్తుకు తెచ్చుకోండి, మీరు ఏ దిశగా అడుగులు వేస్తున్నారో చూడండి. ఎక్కడైనా సమయం వృధాగా గడిచిందా గమనించండి
ధ్యానం మానేయవద్దు.. భగవంతుడికి మిమ్మల్ని దగ్గరచేసేది అదే అని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన నిద్రకు మంచి మూలకం కూడా ధ్యానమే.