ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పదేపదే పాడైపోతున్నాయా? ఇది కూడా వాస్తు దోషమేనట!
ఇంట్లో శక్తి అసమతుల్యత నేరుగా ఇంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రభావం చూపుతుందంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్ని మూలకానికి సంబంధించినవి, కాబట్టి వాటిని సరైన దిశలో ఉంచకపోతే ఇంటి శక్తి సమతుల్యతకు ఆటంకం కలుగుతుంది.
ఇంట్లో అస్తవ్యస్తంగా ఉంచిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్రిజ్, టీవీ, RO, మిక్సర్, లైట్లు, ఫ్యాన్లు లోపాలకు కారణమని రాహువు చెడు దశలో ఉండడమే కారణం అని చెబుతారు
రాహువు చెడు స్థితి ఆర్థిక ఇబ్బందులను తెస్తుంది.. ఏదో ఒక సాకుతో మనిషి డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది, సంపాదించడంలోనూ సమస్యలను ఎదుర్కోకతప్పదు
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి పైకప్పుపై పగిలిన లేదా పాడైన వస్తువుల వంటి చెత్తను ఉంచడం వల్ల ఇంటి సభ్యుల జాతకంలో రాహు గ్రహం బలహీనంగా మారుతుంది. అంతేకాకుండా, పైకప్పుపై ఎప్పుడూ మట్టి ఉండటం కూడా మంచిది కాదు. ఇది కూడా రాహు గ్రహం బలహీనపడటానికి కారణమవుతుంది.
రాహువును శాంతింపజేయడానికి శనివారం నాడు మీరు ఏదైనా దేవాలయంలో విద్యుత్ సంబంధిత పరికరాన్ని దానం చేయండి
ప్రతిరోజూ శివుడికి నీటితో అభిషేకం చేయండి. మహాదేవుని పూజతో రాహు కేతువు సహా సమస్త గ్రహాల అశుభాలు తొలగిపోతాయి. ఎలక్ట్రానిక్ వస్తువులలో లోపాల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.