James Cameron Best Movies: 'అవతార్' కాదు... జేమ్స్ కామెరూన్ తీసిన బెస్ట్ ఫిల్మ్స్ చూశారా? ఈ ఏడూ మిస్ కావొద్దు
'టర్మినేటర్' సినిమా అక్టోబర్ 26, 1984న విడుదలైంది. ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అద్భుతంగా ఉంటాయి. భవిష్యత్తు నుంచి వచ్చి ఒక అమ్మాయిని చంపాలనుకునే ఒక సైబోర్గ్ హంతకుడి కథ ఇది. ఈ అమ్మాయియే భవిష్యత్తులో మానవులను అంతరించిపోకుండా కాపాడే యోధుడి తల్లి అవుతుంది.
'ఏలియన్స్' సినిమా జూలై 18, 1986న విడుదలైంది. ఏలియన్స్, ఎలెన్ రిప్లై కథను మరింత ప్రమాదకర మలుపు తిప్పుతుంది. ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా.
'టర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే' సినిమా జూలై 3, 1991న విడుదల అయ్యింది. ఇప్పటి వరకు వచ్చిన సీక్వెల్ సినిమాల్లో ఇది బెస్ట్ అంటారు చాలా మంది. ఈసారి భవిష్యత్తు నుంచి వచ్చిన సైబోర్గ్, సారా కోనర్ కుమారుడు, పది సంవత్సరాల వయసున్న జాన్ కోనర్ ను రక్షిస్తాడు. ఎందుకంటే... మరింత అధునాతనమైన, శక్తివంతమైన సైబోర్గ్ అతనిని చంపడానికి వస్తాడు.
'టైటానిక్' సినిమా డిసెంబర్ 19, 1997న విడుదలైంది. పదిహేడు సంవత్సరాల ధనవంతురాలైన అమ్మాయి, పేదవాడు అయినప్పటికీ ప్రతిభావంతుడైన కళాకారుడికి మధ్య టైటానిక్ ఓడలో జరిగే ప్రేమ కథ ఇది. విషాదకరమైన ముగింపు, ఆ కథ ఎంతో మందికి నచ్చాయి.
'ఏలియన్స్ ఆఫ్ డీప్' 2005లో విడుదలైంది. ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరూన్ నాసా శాస్త్రవేత్తలతో కలిసి సముద్రపు లోతుల్లోకి వెళతారు. బెస్ట్ డాక్యుమెంటరీల్లో ఇదొకటి.
'ఘోస్ట్ ఆఫ్ ద బేబీ' సినిమా 1995లో విడుదల అయ్యింది. ఇదొక హ్యాక్ ఫోటోగ్రాఫర్ కథ. అతను ఓ భారీ ఆఫీస్ బిల్డింగ్ లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ బిల్డింగ్ ను ఒక అల్లరి భూతం వెంటాడుతుంది.
'అవతార్' డిసెంబర్ 18, 2009న విడుదలైంది. ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే కదా!