Upcoming Netflix Shows 2026: లస్ట్ స్టోరీస్ 3 నుంచి ఆమిర్ మేనల్లుడు రీ ఎంట్రీ వరకు... నెట్‌ఫ్లిక్స్‌లో నెక్స్ట్ ఇయర్ వచ్చే బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్
2026లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రాలలో 'ఇక్కా' ఒకటి. ఈ సినిమాతో సన్నీ డియోల్ ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారు. ఆయనతో పాటు అక్షయ్ ఖన్నా కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
నెట్‌ఫ్లిక్స్ లో 2026లో వచ్చే ప్రాజెక్టుల్లో 'లస్ట్ స్టోరీస్ 3' కూడా ఒకటి. దీనికి ముందు వచ్చిన రెండు భాగాలు వైరల్ అయ్యాయి. ఇప్పుడీ మూడవ భాగంలో విక్రమాదిత్య మోట్వాని, కిరణ్ రావు, శకున్ బాత్రా తమ తమ కథలను తీసుకువస్తారు.
'అధూరే హమ్ అధూరే తుమ్' సినిమాలో ఇమ్రాన్ ఖాన్, భూమి పెడ్నేకర్ జంటగా నటిస్తున్నారు. ఇది ఆమిర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ రీ ఎంట్రీ అనుకోవచ్చు. ఈ సినిమా కథ రిలేషన్షిప్స్, ప్రేమ చుట్టూ తిరుగుతుంది.
కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే వీక్షకులకు 'మా - బెన్' ప్రత్యేకమైన సినిమా కావచ్చు. ఇందులో మాధురీ దీక్షిత్, 'యానిమల్' ఫేమ్ తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
'టోస్టర్' సినిమాలో రాజ్ కుమార్ రావు, సన్యా మల్హోత్రా, సీమా పహ్వా నటిస్తున్నారు. ఈ సినిమాతో రాజ్ కుమార్ రావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు.
సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించనున్న మరో సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్ 2026 జాబితాలో ఉంది. ఈ సినిమాలో దీపక్ డోబ్రియాల్, ప్రతీక్ గాంధీ కూడా కనిపించనున్నారు.