✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మెక్కలు, చెట్లు ఉండకూడదు!

RAMA   |  22 Jul 2025 07:30 AM (IST)
1

పండ్లు, పువ్వులు , ఆకులతో నిండిన నీడ చెట్లు ఇంటికి అందాన్నిస్తాయి. చెట్లు , మొక్కలు ఇంటిని మాత్రమే కాకుండా చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచుతాయి . కానీ ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెట్లు, మొక్కలు నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

2

ఇంటి ప్రధాన ద్వారం లేదా తలుపు దగ్గర కొన్ని చెట్లు, మొక్కలు ఉండటం మంచిది కాదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇలాంటి చెట్లు అశాంతి, ఆర్థిక సమస్యలు , ప్రతికూలతను పెంచుతాయి.

3

మనీ ప్లాంట్- దీనిని ధనపు మొక్క అని అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్క శుక్ర గ్రహానికి సంబంధించినది మరియు ఈ మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటిలో సరైన దిశలో లేదా స్థలంలో నాటితే చాలా లాభం ఉంటుంది. కానీ మనీ ప్లాంట్ ను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా ఇంటి బయట నాటకూడదు. దీనివల్ల ధన నష్టం జరుగుతుంది.

4

వాస్తు శాస్త్రం ప్రకారం రావి చెట్టు ఇంటి గుమ్మానికి దగ్గరగా ఉండకూడదు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నాటిన రావి చెట్టు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. రావిని హిందూ ధర్మంలో పవిత్రమైన వృక్షంగా భావిస్తారు, అయితే దీనిని ఇంటి లోపల లేదా ప్రధాన ద్వారం దగ్గర నాటకుండా ఉండాలి.

5

ఇంటి ప్రధాన ద్వారం వద్ద ముళ్ల లేదా పాలు వచ్చే మొక్కలను ఉంచకూడదు. ఇది పొరుగువారితో లేదా బంధువులతో సంబంధాలను దెబ్బతీస్తుంది.

6

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చింత, మందార, రేగు వంటి చెట్లు కూడా ఉండకూడదు. ఇంటి దగ్గర చింత చెట్టు ఉండటం వల్ల ప్రతికూల శక్తి ఆకర్షిస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం, మందార మొక్క కూడా ఇంటి ముందు ఉండటం అశుభంగా భావిస్తారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మెక్కలు, చెట్లు ఉండకూడదు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.