తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీగా తరలి వచ్చిన భక్తులు - ఉదయం మోహినీ అవతారం ..సాయంత్రం గరుడవాహన సేవ!
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాహనసేవలలో భాగంగా అక్టోబరు 08 ఉదయం మోహిని అవతారంతో మాడవీధుల్లో విహరించారు మలయప్పస్వామి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅక్టోబరు 08 సాయంత్రం గరుడవాహన సేవ జరగనుంది. వాహనసేవల్లో అత్యంత విశిష్టమైన ఈ సేవను చూసి తరించేందుకు భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
శ్రీవారి ప్రియభక్తుడైన గరుత్మంతుడి వాహనంపై విహరించే మలయప్పస్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయంటారు.
అక్టోబరు 08 మంగళవారం సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 11 గంటలవరకూ గరుడవాహన సేవ జరగుతుంది. ఈ రోజు ఉదయాన్నే మోహిని మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన మలయప్పస్వామిని భారీగా భక్తులు దర్శించుకున్నారు.
గరుడవాహన సేవ సందర్భంగా 24 గంటల పాటూ కొండపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదు. నడకమార్గంలో స్వామి సన్నిధికి చేరుకోవచ్చు.
ఉదయం మోహని అవతారాన్ని భారీగా భక్తులు దర్శించుకోగా..సాయంత్రం జరగనున్న గరుడవానన సేవకు దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా..
గరుడవాహన సేవకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మాడవీధుల్లో దాదాపు 2 లక్షల మంది ప్రత్యక్షంగా వాహనసేవ చూసేలా ఏర్పాట్లు చేశారు..
భక్తులు పార్కింగ్ స్థలాలు గుర్తించేందుకు క్యూ ఆర్ కోడ్ లు ఏర్పాటు చేశారు. తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో పార్కింగ్ స్థలాలతో పాటూ తిరుమలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచారు