Exit Poll 2024
(Source: Poll of Polls)
Shree Mahakaleshwar Temple Ujjaini: ఉజ్జయిని మహాకాళేశ్వరుడు-మహంకాళి ఫొటోస్
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నగరంలో కొలువైంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ పరమేశ్వరుడు పూజలందుకుంటున్నాడని చెబుతారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఆలయంలో విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ శివలింగం ముఖం దక్షిణం వైపు ఉంటుంది. ఈ లక్షణం మరే శివాలయంలో వుండదు. ఉజ్జయినిలో మొత్తం మూడు లింగాలు దర్శనమిస్తాయి. ఈ మూడు లింగాలు మూడు అంతస్తులలో ప్రతిష్టించి ఉంటాయి. మొదటి అంతస్తులో మహాకాళ లింగం. రెండవ అంతస్తులో ఓంకార లింగం, మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం కొలువై ఉన్నాయి.
ఇక్కడ మహాకాళ లింగానికి తెల్లవారుజామున విశిష్టమైన హారతిస్తారు. అదే భస్మహారతి. ఇది రెండు రకాలుగా నిర్వహిస్తారు. గోమయం పిడకల్ని విభూతిగా మార్చి రెండు మూటల్లో నింపి వాటిని ఒకదానితో మరొకటి తాడనం చేస్తూ ఆ విభూతి లింగంపై పడుతూ ఆ గర్భగుడి నిండా ఆవరిస్తుంది… మరొకటి శ్మసానంలో మొదట కాలిన శవం బూడిదతో ఇచ్చే హారతి...దీనిని నాగసాధువులు నిర్వర్తిస్తారు.
మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని దేవీ భాగవతంలో ఉంది. ఇక్కడ ఈ తల్లి మహంకాళీ రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి.
ఉజ్జయిని మహాకాళేశ్వరుడు-మహంకాళి ఆలయం
ఉజ్జయిని మహాకాళేశ్వరుడు-మహంకాళి ఆలయం
ఉజ్జయిని మహాకాళేశ్వరుడు-మహంకాళి ఆలయం
ఉజ్జయిని మహాకాళేశ్వరుడు-మహంకాళి ఆలయం
ఉజ్జయిని మహాకాళేశ్వరుడు-మహంకాళి ఆలయం
ఉజ్జయిని మహాకాళేశ్వరుడు-మహంకాళి ఆలయం
ఉజ్జయిని మహాకాళేశ్వరుడు-మహంకాళి ఆలయం
ఉజ్జయిని మహాకాళేశ్వరుడు-మహంకాళి ఆలయం
ఉజ్జయిని మహాకాళేశ్వరుడు-మహంకాళి ఆలయం
ఉజ్జయిని మహాకాళేశ్వరుడు-మహంకాళి ఆలయం