రుద్రాక్ష ధరించేందుకు ఏ రోజు మంచిది? రుద్రాక్ష వేసుకున్న వారు పాటించాల్సిన నియమాలేంటి?
గ్రంథాల ప్రకారం జగత్తు క్షేమం కోసం చాలా సంవత్సరాల తపస్సు తర్వాత శివుడు కళ్ళు తెరిచినప్పుడు ఆ కంటి నుంచి రాలిన నీరు చెట్టుగా మారి రుద్రాక్ష పుట్టింది. శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరం. అందుకే ఈ నెలలో రుద్రాక్ష ధరించడం అత్యంత శుభకరం అని చెబుతారు పండితులు
శ్రావణ సోమవారం, శివరాత్రి, ప్రదోష వ్రతం...ఈ తేదీల్లో రుద్రాక్ష ధరించడం చాలా ప్రయోజనకరం. ఉదయం సమయంలో వాతావరణం స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది..అందుకే వేకువజామునే పూజ చేసి రుద్రాక్ష ధరించే ఆ శక్తి మీ శరీరానికి అందుతుంది
ఎర్రటి వస్త్రంపై రుద్రాక్షను ఉంచి పూజా స్థలం లేదా శివలింగంపై ఉంచండి. పంచాక్షరీ ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. తరువాత, దానిని గంగాజలంతో శుభ్రం చేసి పంచామృతంలో ముంచి కొంత సమయం ఉంచండి. తరువాత ధరించండి.
రుద్రాక్షను ఎప్పుడూ ఎర్ర దారంలో ధరించాలి, దానిని ధరించిన తర్వాత సాత్విక దినచర్యను పాటించాలి అప్పుడే దాని ఫలితం లభిస్తుంది లేకపోతే అది అపవిత్రమవుతుంది.
ఆధ్యాత్మిక నమ్మకం ప్రకారం రుద్రాక్ష ధరించిన 7 లేదా 21 రోజుల్లో దాని ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తుంది, అయితే దీని కోసం జీవనశైలిలో నియమాలను పాటించడం చాలా ముఖ్యం, అప్పుడే దాని ఫలితం లభిస్తుంది.
రుద్రాక్షను శ్మశాన వాటికలో, నవజాత శిశువు పుట్టినప్పుడు లేదా లైంగిక సంబంధాల సమయంలో ధరించకూడదు.