Puri Jagannath Rath Yatra 2025: గర్భగుడి నుంచి భక్తజనం మధ్యకు తరలివచ్చే జగన్నాథుడు .. రథయాత్ర గురించి ఈ విషయాలు తెలుసా!
ప్రపంచంలో అత్యంత పురాతనమైనది పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఎప్పుడు మొదలైందన్నది స్పష్టమైన ఆధారాలు లేవు.. బ్రహ్మపురాణం, పద్మపురాణంలోనూ రథయాత్ర గురించి ఉంది
గర్భగుడిలో ఒక్కసారి ప్రతిష్ఠించిన విగ్రహాలు బయటకు తీసుకురారు..కేవలం ఉత్సవ విగ్రహాలనే ఊరిగేస్తారు. కానీ పూరీ ఆలయంలో మాత్రం గర్భగుడిలో కొలువైన జగన్నాథుడినే బయటకు తీసుకొస్తారు
రథయాత్రకు ఏటా కొత్త రథాలు వినియోగిస్తారు..ఇందుకోసం అక్షయ తృతీయ నుంచి ఏర్పాట్లు ప్రారంభిస్తారు
జగన్నాథ స్వామి రథం పేరు గరుడధ్వజం, బలరాముడి రథం పేరు తాళధ్వజం, సుభద్ర రథ పేరు దేవదాలన. ఒక్కో రథం తయారీకి కొన్ని లెక్కలుంటాయి..వాటిని అనుసరించి తయారు చేస్తారు
విశ్వానికి రాజు జగన్నాథుడు..అందుకే రథయాత్ర ప్రారంభానికి ముందు పూరీ రాజు బంగారుచీపురుతో రథ ముందు ఊడ్చే సేవలో పాల్గొంటారు
ఏ రథయాత్ర అయినా ఊరంతా తిరిగిన తర్వాత తిరిగి ఆలాయానికే చేరుకుంటుంది కానీ జగన్నాథుడి రథయాత్రలో మాత్రం గుండిచా ఆలయం వద్ద ఆగిపోతుంది..పదో రోజు తిరిగి ఆలయానికి చేరుకుంటాడు జగన్నాథుడు