Brahmamudi Serial Today June 26th Episode: యామిని నిజస్వరూపం రాజ్ ముందు అప్పు బయటపెడుతుందా - బ్రహ్మముడి జూన్ 26 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్య వెళ్లిపోవడం చూసి రాజ్ కాల్ చేస్తాడు. మీకోసం ఇంటికొస్తే అవమానించారని అంటాడు. అర్జెంట్ పనిలో ఉన్నాను మళ్లీ మాట్లాడుతాను అంటుంది. ఏదైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. అవసరమైతే తప్పకుండా అడుగుతాను అంటుంది
అప్పుడే రాజ్ దగ్గరకు వచ్చిన అపర్ణ, ఇందిరాదేవి..నా మనవరాలికి ఎప్పుడూ సమస్యలే. ఏమీ అనుకోవద్దు తనే వచ్చేస్తుంది అని సర్దిచెబుతారు
స్వప్న కారు చూసి కారు ఆపి దిగిన కావ్య చెక్ చేస్తుంది కానీ లోపల ఎవరూ కనిపించరు. కావ్య టెన్షన్లో ఉండగా యామిని కాల్ చేస్తుంది
స్వప్న ను రౌడీలు తరుముతుంటే పరిగెత్తుతుంటుంది. రౌడీల బారినుంచి తప్పించుకునేందుకు విగ్రహం వెనుక దాక్కుంటుంది స్వప్న
స్వప్నను రౌడీలు కత్తితో పొడుస్తుండగా కావ్య వెనుకనుంచి కొడుతుంది. వాళ్లనుంచి తప్పించుకుని వస్తుండగా రేవతి అనే ఆమె కాపాడుతుంది. ఎవరు మీరు అని అడిగితే..నాకు మీ కుటుంబం గురించి బాగా తెలుసు అని చెబుతుంది. థ్యాంక్స్ చెబుతుంది కావ్య
ఇప్పుడే బయటకు వెళ్లడం సేఫ్ కాదని చెబుతుంది రేవతి. మీ కుటుంబం మాకు చేసిన సాయం ముందు ఇదెంత అంటుంది. ఇంట్లో వాళ్లకి కాల్ చేయమంటుంది. కానీ ఇంట్లో కంగారుపడతారని ఆలోచించి కాల్ చేయరు కావ్య , స్వప్న.
దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్య కోసం ఎదురుచూస్తుంటారు. హమ్మయ్య ఇక కావ్య, స్వప్న రారు అని రుద్రాణి సంతోషంగా ఉంటుంది.
ఇంతలో అప్పుకి కాల్ చేసిన కావ్య.. స్వప్న కిడ్నాప్ గురించి చెబుతుంది. ఇంట్లో ఎవరికీ ఇప్పుడే చెప్పొద్దని తామున్న అడ్రస్ ఇస్తుంది.
అప్పు బయటకు వెళుతుండగా ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మి. ఎప్పుడూ నీస్వార్థమేనా మరో కుటుంబాన్ని కాపాడేందుకు వెళుతోంది తను అని సపోర్ట్ చేస్తారు ఇందిరాదేవి, అపర్ణ
బ్రహ్మముడి జూన్ 27 ఎపిసోడ్ లో... ఇంటికి వచ్చిన కావ్యను నిలదీస్తుంది అపర్ణ. నిజం చెబుతుంది స్వప్న. యామిని ఇంటికెళ్లి లాగిపెట్టి కొడుతుంది అప్పు...