Pitru paksha 2025: పితృదేవతల ఫొటోలు ఉంచేందుకు ఏ దిశ శుభం, ఏ దిశ అశుభం?
ఇంటి సభ్యులలో ఎవరైనా మరణించిన తరువాత వారి ఫొటోని ఇంట్లో ఉంచుతారు. తద్వారా పితృదేవతల అనుగ్రహం తమపై ఉంటుందని నమ్ముతారు. అయితే ఈ ఫొటోను తప్పుడు దిశలో ఉంచితే సమస్యలకు కారణం కావొచ్చంటున్నారు వాస్తు నిపుణులు
వాస్తు శాస్త్రంలో అన్ని వస్తువులను ఉంచే విధానంతో పాటుగా పితృదేవతల ఫొటో ఉంచడానికి నియమాలున్నాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫొటోను ఉంచేందుకు దక్షిణం వైపు గోడకి ఉండాలి. దక్షిణ దిశకు యముడు అధిపతి అని చెబుతారు
శాస్త్రాల ప్రకారం దక్షిణ దిశ పితృదేవతల దిశ అని అందుకే ఫొటోలు ఇటు ఉంచాలని చెబుతారు
చనిపోయిన వారి ఫొటోలను లివింగ్ రూమ్, బెడ్ రూమ్, పూజా గదిలో ఎప్పుడూ ఉంచకూడదు..ఇలా చేస్తే ఆ కుటుంబంలో సమస్యలు పెరుగుతాయని చెబుతారు
జీవించి ఉన్న వ్యక్తితో ఎప్పుడూ మరణించిన పూర్వీకుల ఫొటోలను ఉంచకూడదు. అలాగే పితృదేవతల ఫొటోలు ఇంటి గోడలపై ఎక్కువగా ఉండకూడదని కూడా వాస్తు నిపుణులు చెబుతారు