Kidney Failure : కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు ఇవే.. ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే
కిడ్నీలో సమస్యలు ఉంటే.. మూత్రంలో మార్పులు వస్తాయి. ఇదే మొదటి సంకేతంగా చెప్తారు. మూత్రం అకస్మాత్తుగా తగ్గినా లేదా నురగగా కనిపించినా.. మూత్రపిండాల నుంచి ప్రోటీన్ లీక్ అవుతుందనడానికి సంకేతం అవుతుంది.
కిడ్నీ సమస్యలకు వాపు (ఎడీమా) కూడా ఒక సాధారణ లక్షణం. కాళ్లల్లో, చీలమండలలో, ముఖంలో అకస్మాత్తుగా వాపు కనిపిస్తుంది. శరీరంలో అదనపు నీరు పేరుకుపోవడాన్ని సూచిస్తుంది.
నిరంతరం అలసట, బలహీనతతో ఇబ్బంది పడటం కూడా మూత్రపిండాల వైఫల్యానికి సంకేతమే. మూత్రపిండాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేయడాన్ని తగ్గిస్తాయి.
మూత్రపిండాల సమస్య వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా మొదలవుతుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు.. కొద్దిగా పని చేసినా లేదా పడుకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి.
కిడ్నీ ఫెయిల్యూర్‌కు వాంతులు, వికారం వంటివి లక్షణాలు ఉంటాయి. రక్తంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల కడుపులో మంట, ఆకలి తగ్గడం, నోటిలో మెటల్ రుచి వంటివి కలుగుతాయి.
మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల చర్మంపై దురద, పొడిబారడం కూడా జరుగుతుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళకపోవడం వల్ల.. ఈ సమస్య పెరుగుతుంది.
మూత్రపిండాల వైఫల్యం మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. ఏకాగ్రత తగ్గుతుంది. జ్ఞాపకశక్తి సమస్యలకు దారితీస్తుంది. ఇది తీవ్రమైన పరిస్థితిని సూచిస్తుంది.