Amavasya: ఇంట్లో డబ్బు కొరత ఉండదు! డిసెంబర్ 19 మార్గశిర అమావాస్య రోజు ఇవి పాటించండి!
డిసెంబర్ 19 మార్గశిర అమావాస్య. ఈ రోజు రావి చెట్టుకు నీరు, పచ్చి పాలు, బెల్లం , నల్ల నువ్వులు కలిపి సమర్పించండి, ఆ తరువాత 7 ప్రదక్షిణలు చేయండి. ఈ పరిహారం పితృదేవతలకు మోక్షాన్ని కలిగిస్తుందని కుటుంబంలోని దోషాలను తొలగిస్తుందని నమ్ముతారు.
అమావాస్య రోజున గోవును దానం చేయడం ఉత్తమం. దీని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం
మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉండటానికి అమావాస్య నాడు స్నానం చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపుతో స్వస్తిక్ వేయండి లేదా గుర్రపు నాడాను వేలాడదీయండి. ఇది ప్రతికూలతను దూరం చేస్తుంది.
అమావాస్య రోజున సాయంత్రం సమయంలో శివలింగంపై పచ్చి పాలు , పెరుగుతో అభిషేకం చేయండి. దీనివల్ల మీ పనులన్నీ నెమ్మదిగా పూర్తవుతాయని ధన సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.
ఈ రోజు మీ మెడలో , చేతికి ఉన్న పాత దారాలు తీసేసి కొత్తదారం ధరించండి
అమావాస్య రాత్రి శ్రీసూక్తం పఠించడం లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే అంటారు పండితులు.