కొన్ని చోట్ల చీపుర్లు మరికొన్ని చోట్ల సాలె గూళ్ళు, క్రిస్మస్ జరుపుకునే విధానం ఈ దేశాల్లో చాలా విచిత్రంగా ఉంటుంది
నార్వేలో క్రిస్మస్ రాగానే ప్రజలు తమ ఇళ్లలోని చీపుర్లు, తుడవడానికి వాడే గుడ్డలను దాచిపెడతారు. కారణం శుభ్రపరచడం మానుకోవడం కాదు, చెడు ఆత్మల భయం. క్రిస్మస్ రోజున చెడు శక్తులు భూమిపైకి తిరిగి వస్తాయని చీపురు వారి అభిమాన సాధనమని అక్కడ నమ్ముతారు
ఐస్లాండ్ లో క్రిస్మస్ 13 రోజుల పాటు జరుగుతుంది. ఈ సమయంలో పిల్లలు ప్రతి రాత్రి తమ బూట్లు కిటికీ దగ్గర పెట్టి నిద్రపోతారు. మంచిగా ప్రవర్తించే పిల్లలకు మిఠాయిలు లభిస్తాయని, అలాగే అల్లరి చేసే పిల్లల బూట్లలో కుళ్ళిన బంగాళాదుంపలు వేస్తారని నమ్ముతారు.
కెనడాలో క్రిస్మస్ నేరుగా శాంతా క్లాజ్‌తో ముడిపడి ఉంటుంది. ఇక్కడ శాంతా ఇల్లు కెనడాలో ఉందని నమ్ముతారు. పిల్లలు పోస్ట్ ద్వారా శాంతాకు లేఖలు పంపుతారు , ఆశ్చర్యకరంగా వారికి సమాధానాలు కూడా వస్తాయి.
యూక్రెయిన్ , పోలాండ్ వంటి దేశాలలో క్రిస్మస్ నాడు బహుమతులు తెరిచేందుకు ఒక షరతు కూడా ఉంది. ఇక్కడ ఇంట్లో చిన్న పిల్లవాడు ఆకాశంలో మొదటి నక్షత్రం కనిపించే వరకు ఎదురు చూస్తాడు. దీనిని గైడింగ్ స్టార్ అంటారు. మొదటి నక్షత్రం కనిపించగానే బహుమతులు తెరిచేందుకు అనుమతిస్తారు.
ఫిన్లాండ్ లో క్రిస్మస్ ఉదయం బియ్యం , పాలతో చేసిన గంజి తింటారు. ఇందులో ఒక బాదం దాచిపెడతారు . ఎవరికైతే బాదం దొరుకుతుందో, వారు సంవత్సరం పొడవునా అదృష్టవంతులుగా భావిస్తారు. చాలా ఇళ్లలో పిల్లల సంతోషం కోసం వారి ప్లేట్లలో కావాలని ఎక్కువ బాదం వేస్తారు.
ఉక్రెయిన్ లో క్రిస్మస్ చెట్టుపై మెరిసే సాలీడు గూళ్ళ లాంటి ఆభరణాలు పెడతారు. ఇవి అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు.
ఫిలిప్పీన్స్ లోని సాన్ ఫెర్నాండో నగరంలో ప్రతి సంవత్సరం లాంతర్ల పండుగ జరుగుతుంది, ఇక్కడ పెద్ద , మెరిసే లాంతర్లను అలంకరిస్తారు. వీటిని బెత్లెహేం నక్షత్రానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ నగరాన్ని క్రిస్మస్ రాజధాని అని పిలుస్తారు.