జూలై 25 నుంచి శ్రావణమాసం - ఈ నెల రోజు సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య ఈ పని చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుంది!
హిందూ ధర్మంలో పూజ సమయంలో దీపం వెలిగించే ఆచారం ఉంది. దీపం వెలిగించిన తర్వాత పూజ ప్రారంభిస్తారు
సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం చాలా మంచిదిగా భావిస్తారు. సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. వాస్తు ప్రకారం ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా చేస్తుంది.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల రాహు గ్రహం దుష్ప్రభావం కూడా తొలగిపోతుంది. మీరు ప్రధాన ద్వారంతో పాటు సాయంత్రం గుడిలో లేదంటే ఇంటి బయట తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి
సాయంత్రం వేళ ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుందని ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని పండితులు చెబుతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం 5-8 గంటల మధ్య మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించవచ్చు. ఈ సమయం చాలా మంచిదిగా పరిగణిస్తారు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద వెలిగించే దీపం మీరు బయటకు వెళ్లినప్పుడు కుడివైపు ఉండేలా పెట్టండి. దీపం వెలిగే ఒత్తి దిశ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండొచ్చు. పడమర, దక్షిణ దిశల్లో దీపం వెలిగించవద్దు