Lalbaugcha Raja Look 2025: ముంబై లాల్‌బాగ్చా రాజా గణపతి 2025 ఫస్ట్ లుక్ చూశారా! ఈ సారి ప్రత్యేకత ఇదే!
గణేష్ చతుర్థి ఆగస్టు 27 న..ముందుగానే లాల్ బాగ్చా రాజా ఫస్ట్ లుక్ వచ్చేసింది. రాజసం కలిగిన వినాయక విగ్రహాన్ని చూసి భక్తులు ముగ్ధులయ్యారు. మహారాష్ట్రలో గణేష్ చతుర్థి సందర్భంగా లాల్ బాగ్చా రాజాను చూడటానికి ఏటా లక్షలాది ప్రజలు తరలివస్తుంటారు
ఈ సంవత్సరం వినాయకుడి చేతిలో చక్రం, తలపై ఆకర్షణీయమైన కిరీటం, ఊదా రంగు ధోవతి ఉన్నాయి. లాల్ బాగ్చా రాజా రూపం చాలా మనోహరంగా అద్భుతంగా ఉంది.
లాల్ బాగ్చా రాజా దుపట్టా ఈసారి చాలా ప్రత్యేకంగా ఉంది, దీనిపై శంఖం , బాలబాలాజీకి వేసే తిలకం ఆకారం ఉంది. ఈ తిలకం విష్ణువు పట్ల భక్తిని సూచిస్తుంది. తెల్ల చందనం ఎర్ర కుంకుమతో చేసిన ఈ తిలకం విష్ణువు పవిత్రమైన నాడులు ఇడా పింగళలను సూచిస్తుందని నమ్మకం.
ఆ సంవత్సరం మండపంను తిరుపతి బాలాజీ స్వామి వారి థీమ్తో అలంకరించారు. మండపం దృశ్యం ఒక బంగారు భవనంలా కనిపిస్తుంది, ఇది ప్రత్యేకంగా రూపొందించారు
1934 నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహం స్థాపిస్తారు. ముంబైలో ప్రసిద్ధమైన లాల్‌బాగ్చా రాజ గణేశ మండలం ఈ సంవత్సరం తన 92వ సంవత్సర గణేశోత్సవం జరుపుకుంటుంది.
ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతం ఒకప్పుడు మత్స్యకారుల నివాసంగా ఉండేది. ఇక్కడి ప్రజలు చాలా కాలంగా ఒక స్థిరమైన మార్కెట్ కావాలని కోరుకుంటున్నారు, కాని అది నెరవేరలేదు. చాలా ప్రయత్నాలు చేసిన తరువాత కూడా వారు విఫలమైనప్పుడు..కార్మికులు, స్థానికులు కలసి మొదటిసారి ఇక్కడ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు