Vinayaka Chavithi Fashion 2025 : వినాయక చవితికి ట్రెడీషనల్గా ముస్తాబవుతున్నారా? అయితే ఈ సెలబ్రెటీల లుక్స్ ట్రై చేయండి
పసుపు చీర పండుగకు బాగా నప్పుతుంది. పండుగ సమయంలో ఆలియా లుక్‌ని మీరు ఎల్లో శారీతో ట్రై చేయవచ్చు. కట్ స్లీవ్స్ బ్లౌజ్, సింపుల్ ఆభరణలతో స్టైల్ చేయవచ్చు. ఇది మీకు ట్రెడీషనల్, ట్రెండీ లుక్‌ని ఇస్తుంది.
గోల్డెన్ డ్రేప్, హెవీ బ్లౌజ్, క్లాసిక్ జ్యువెలరీతో మీరు వినాయక చవితికి ఈ లుక్‌ని ట్రై చేయవచ్చు. జాన్వీ మాదిరిగా ముస్తాబు కావచ్చు. వైట్ కలర్, గోల్డెన్ అంచు చీరలు పండుగలు, ఇతర పూజా సమయాల్లో బాగా నప్పుతాయి. కాబట్టి ఇది ఎప్పటికీ బెస్ట్ లుక్గానే ఉంటుంది.
పండుగ సమయంలో మీరు చీరకు బదులు లెహంగాను వేసుకోవాలనుకుంటే అనన్యా పాండే లుక్ బెస్ట్. పింక్ లెహంగా సెట్లో.. దుపట్టా వేసుకని.. సింపుల్ జ్యూవెలరీతో, న్యూడ్ మేకప్ లుక్‌తో మీరు బెస్ట్ లుక్ రీక్రియేట్ చేయవచ్చు.
కియారా అద్వానీ దేశీ లుక్‌లో సింపుల్‌గా, ఎలిగెన్స్‌తో ఎలా కనిపిస్తుందో.. మీరు కూడా పండుగకి పర్ఫెక్ట్గా కనిపించాలనుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. తెల్లని చీర, సింపుల్ జ్యువెలరీ, ఓపెన్ హెయిర్ స్టైల్ ఫ్రెష్ లుక్ ఇస్తుంది.
కత్రినా కైఫ్ తరహాలో భారీ ఎంబ్రాయిడరీ చీర, దుద్దులు, బొట్టు మీకు మంచి రాయల్ లుక్ ఇస్తాయి. పైగా పండుగ సమయంలో చాలామంది ఎంబ్రాయిడరీ చీరలు ఎంచుకుంటారు. కాబట్టి ఈ లుక్ మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేలా చేస్తుంది.
కరీనా కపూర్‌లాగా ఎర్రని చీర కట్టుకోవచ్చు. పండుగ సమయంలో ఇది కూడా వైబ్రెంట్‌గా కనిపిస్తుంది. పండుగలు, ఇతర పూజా కార్యక్రమాలకు ఇది మంచి ఎంపిక అవుతుంది. భారీ వర్క్ చీరను నెక్లెస్, ఓపెన్ హెయిర్‌తో ఎఫర్ట్లెస్గా గ్రాండ్‌గా కనిపించవచ్చు.
మీరు చీర, లెహంగాలకు దూరంగా ఉండాలనుకుంటే కృతి సనన్ స్టైల్లో కుర్తాను ట్రై చేయవచ్చు. ఇది ట్రెడీషనల్, ట్రెండ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. భారీ ఎంబ్రాయిడరీ కుర్తాతో, జుంకాలు పెట్టుకుని మినిమల్ మేకప్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది అంతే.