Real vs Fake Turmeric : మీరు వాడే పసుపు నిజమైనదా? లేదా నకిలీనా? ఈ సింపుల్ టెస్ట్‌లతో ఈజీగా తెలుసుకోండి
ఒక గ్లాసు నీటిలో పసుపు పొడి వేసి కొంత సమయం ఉంచండి. పసుపు కిందకు చేరి.. నీరు తేటగా ఉంటే.. అది నిజమైనది. కానీ నీటి రంగు ముదురుగా మారితే.. అది కల్తీ అని అర్థం.
పసుపును మీ అరచేతిలో లేదా తెల్లటి బట్టపై రుద్ది చూడండి. తర్వాత అసలైన పసుపు రంగు సులభంగా పోతుంది. కానీ నకిలీ పసుపు మరక చాలా కాలం పాటు ఉంటుంది.
కొంచెం పసుపును నీటిలో కలిపి.. అందులో సబ్బు నురుగు కలపండి. పసుపు రంగు మరింత ముదురుగా మారితే అందులో కల్తీ ఉండవచ్చు. అసలైన పసుపు రంగు నురుగుతో పెద్దగా మారదు.
ఒక స్పూన్ పసుపు పొడిలో కొన్ని చుక్కల అయోడిన్ వేయండి. దాని రంగు నీలం లేదా నలుపు రంగులోకి మారితే.. అందులో పిండి పదార్థం కలిపారని అర్థం చేసుకోండి.
అసలైన పసుపులో కొంచెం మట్టి వంటి సహజమైన అరోమా ఉంటుంది. రుచిలో కొద్దిగా చేదుగా ఉంటుంది. నకిలీ పసుపులో వాసన ఘాటుగా ఉండొచ్చు.
పసుపులో నిమ్మరసం కొన్ని చుక్కలు వేయండి. నురగ లేదా బుడగలు వస్తే.. అది కచ్చితంగా కల్తీనే. నిజమైన పసుపుపై నిమ్మరసం ప్రభావం చూపించదు.