Kartik month 2025 : కార్తీక మాసం వచ్చేస్తోంది! నియమాలు, ఏం చేయాలి , ఏం చేయకూడదో తెలుసుకోండి!
ఆశ్వీయుజ మాసం ముగిసిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇది హిందూ క్యాలెండర్లో ఎనిమిదవ నెల. శివకేశవుల పూజకు అత్యంత అనుకూల సమయం ఇది. ఈ ఏడాది కార్తీకమాసం అక్టోబర్ 22 న ప్రారంభమై నవంబర్ 20న ముగుస్తుంది
కార్తీక మాసంలోని 30 రోజుల్లో చేసే శుభ కార్యాల వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో తెలుసుకోండి.
కార్తీక మాసంలో స్నానం , దీపదానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందువల్ల క్రమం తప్పకుండా సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించండి. నదులకు వెళ్లలేని వారు ఇంట్లో గంగాజలాన్ని కలుపుకుని స్నానం ఆచరించవచ్చు
కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేక పర్వదినాల్లో వ్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి. కార్తీకమాసంలో వచ్చే ఏకాదశిని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజున విష్ణువు నాలుగు నెలల నిద్ర తరువాత మేల్కొంటారు శుభ కార్యాలు ప్రారంభమవుతాయి.
కార్తీక మాసంలో 30 రోజుల పాటు ఉదయం.. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండి. ముఖ్యంగా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం శుభప్రదం. నది లేదా సరస్సు ఉంటే సాయంత్రం దీపదానం తప్పకుండా చేయండి.
ఇదే సమయంలో కార్తీక మాసంలో మరికొన్ని నియమాలు పాటించాలి. ఈ నెలలో మాంసాహారం తినకూడదు. ధూమపానం , మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి.
కార్తీకమాసం నియమాలు పాటించేవారు ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. కోపం, అసూయ, లోభం వంటి భావాలకు దూరంగా ఉండాలి. పెద్దలను దూషించకూడదు.