Tatkal Ticket Booking Tips : పండుగలకు ఊరికి వెళ్లాలనుకుంటున్నారా? తత్కాల్‌లో కన్ఫార్మ్ సీటును ఇలా బుక్ చేసుకోండి
తత్కాల్ బుకింగ్‌లో మీకు కన్ఫార్మ్ సీటు వచ్చే అవకాశాలుంటాయి. కానీ మీకు 100 శాతం కన్ఫార్మ్ సీటు వస్తుందని గ్యారంటీ లేదు. తత్కాల్‌లో టికెట్ బుక్ చేసినా... వెయిటింగ్‌లో వెళ్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకుని టికెట్ బుక్ చేసుకుంటే సీటు కన్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.
తత్కాల్ బుకింగ్ కోసం మీరు ముందుగానే సిద్ధంగా ఉండాలి. ఎక్కువమంది 10కి బుకింగ్స్ ఓపెన్ అవుతాయని.. ఆ సమయానికే లాగిన్ అయి టిక్కెట్లు పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ బెస్ట్ ఏంటి అంటే.. 9:55 గంటలకే లాగిన్ అయితే మంచిది. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. సైట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. లాగిన్ చేయడంలో సమస్య ఉండదు.
రెండవది ఏమిటంటే మీరు మాస్టర్ జాబితాను సిద్ధం చేసుకోవాలి. ప్రయాణిస్తున్న ప్రయాణీకులందరి ముఖ్యమైన సమాచారాన్ని ముందే సేవ్ చేసుకోవాలి. ప్రయాణికులందరి వివరాలను ముందే నింపి ఉంచుకోండి. బుకింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఇబ్బంది ఉండదు.
దీనివల్ల వివరాలను త్వరగా నింపి సమర్పించగలుగుతారు. మీరు మాస్టర్ జాబితాను ముందుగానే సిద్ధం చేసుకుంటే.. పదేపదే ప్రయాణీకుల సమాచారాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. టికెట్ త్వరగా కన్ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది.
ఆన్లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో తరచుగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, పీక్ సీజన్లలో రష్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 9:55 గంటలకు లాగిన్ అయితే మాస్టర్ లిస్ట్‌ను ఉపయోగించి మీరు ఫారమ్‌ను వేగంగా సమర్పించవచ్చు. ఈ చిన్న ట్రిక్స్ మీకు కన్ఫార్మ్ సీటును పొందడానికి సహాయపడవచ్చు.
దీపావళి, ఇతర పండుగలు, సెలవుల సమయంలో మీరు ఇంటికి వెళ్లాలనుకుంటే.. ఈ రెండు విషయాలు గుర్తించుకోండి. దీనివల్ల మీ టికెట్ కన్ఫార్మ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా చెల్లింపు వివరాలు కూడా ముందే సేవ్ చేసుకుంటే మంచిది.