Tirumala Brahmotsavam Photos: వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు... సూర్య ప్రభ వాహనంపై గోవిందరాజ స్వామి
తిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉత్సవాలు ఏడో రోజుకి చేరుకున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు ఏడో రోజైన బుధవారం శ్రీ గోవింద రాజస్వామి అలంకారంలో మలయప్ప స్వామి సూర్య ప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు.
ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం.
ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
గోవింద రాజ స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న మలయప్ప స్వామి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, తితిదే ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.