శరన్నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేస్తే కష్టాలను ఆహ్వానించినట్టే
నవరాత్రుల తర్వాత పదో రోజు విజయదశమి , దసరా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగకు విశేష ప్రాముఖ్యత ఉంది
దసరా రోజున రావణ దహనం , శస్త్ర పూజ చేసే ఆచారం ఉంది. ఈ రోజునే శ్రీరాముడు రావణుడిని వధించాడని నమ్ముతారు. అదేవిధంగా తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత పదో రోజు శక్తిస్వరూపిణి మహిషాసురుడిని వధించింది.
దసరా రోజున పూజలతో పాటు దానధర్మాలకు కూడా విశేష ప్రాధాన్యత ఉంది. కానీ తెలియకుండానే కొన్ని దానాలు చేస్తే వాటివల్ల పుణ్యం కన్నా సమస్యలు పెరుగుతాయి. అందుకో దసరా రోజు , శరన్నవరాత్రుల్లో దానం చేయకూడని వస్తువులేంటో తెలుసుకుందాం
పదునైన వస్తువులు దానం చేయవద్దు దసరా రోజున కత్తి, సూది, పనిముట్లు వంటి పదునైన వస్తువులను ఎవరికీ దానం చేయవద్దు. ఈ వస్తువులు ప్రతికూలతను ఆకర్షిస్తుంది. శరన్నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేస్తే, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.
పసుపు దానం పసుపు దానం ఇవ్వడం శుభంగా చెబుతారు కానీ శరన్నవరాత్రుల్లో గురు గ్రహానికి సంబంధించిన పసుపు దానం చేయడం వల్ల జాతకంలో బృహస్పతి గ్రహం బలహీనపడుతుంది. అలాగే ఇతర రోజుల్లో కూడా సాయంత్రం సమయంలో పసుపు దానం చేయకుండా ఉండాలి.
చర్మ సంబంధిత వస్తువులైన బెల్టులు, బ్యాగులు, బూట్లు లాంటి తోలు వస్తువులను జంతువుల చర్మంతో తయారు చేస్తారు. కాబట్టి శరన్నవరాత్రుల్లో వీటిని దానంగా ఇవ్వకూడదు. తోలు వస్తువులను హిందూధర్మంలో అపవిత్రంగా భావిస్తారు. వీటిని దానం చేస్తే శుభం బదులు అశుభం కలుగుతుందని నమ్ముతారు