Laxmi Pujan Diwali 2023 Date: 2023 దీపావళి ఆదివారమా -సోమవారమా, లక్ష్మీపూజ సమయం ఏంటి!
వంబరు 12 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం నుంచి అమావాస్య ఘడియలు మొదలయ్యాయి..నవంబరు 13 సోమవారం మధ్యాహ్నం వరకూ అమావాస్య ఘడియలు ఉన్నాయి. సాధారణంగా హిందువుల పండుగలన్నీ తిథి సూర్యోదయానికి ఉండడమే లెక్క కానీ..దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా దీపావళి (Diwali Puja 2023) నవంబరు 12 ఆదివారం సెలబ్రెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు.
సాధారణంగా దీపావళికి ముందు రోజు నరక చతుర్థశి సెలబ్రేట్ చేసుకుంటారు. మరి దీపావళి నవంబరు 12 ఆదివారం అయితే నవంబరు 11 శనివారం నరక చతుర్థశి అవుతుందనుకోవద్దు.
చతుర్థశి తిథి మాత్రం సూర్యోదయానికి ఉన్నదే పరిగణలోకి తీసుకుంటారు. నవంబరు 12 ఆదివారం సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉండడంతో..అదే రోజు నరకతచతుర్థశి..సాయంత్రానికి అమావాస్య తిథి రావడం వల్ల అదే రోజు రాత్రి దిపావళి జరుపుకోవాలి.
నవంబరు 11 శనివారం మధ్యాహ్నం 12.50 వరకూ త్రయోదశి ఉంది..ఆ తర్వాత నుంచి చతుర్ధశి మొదలవుతోంది
చతుర్థశి - శనివారం మధ్యాహ్నం 12.50 నుంచి నవంబరు 12 ఆదివారం మధ్యాహ్నం 1.53 వరకూ ఉంది
అమావాస్య- నవంబరు 12 ఆదివారం మధ్యాహ్నం 1.54 నుంచి నవంబరు 13 సోమవారం మధ్యాహ్నం 2.23 వరకూ ఉంది
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారంతా.