ధనుర్మాసంలో పుట్టినరోజు లేదా వార్షికోత్సవం వస్తే సెలబ్రేట్ చేసుకోవచ్చా?
ధనుర్మాసంలో శుభ-మంగళ కార్యాలకు అనుకూలంగా పరిగణించరు. ఈ సమయం సూర్యుడు ధనుస్సు లేదా మీన రాశిలో ప్రవేశించడంతో ముడిపడి ఉంది సాధారణంగా వివాహం, గృహ ప్రవేశం వంటి పెద్ద కార్యక్రమాలను నిర్వహించరు
వివాహం, గృహ ప్రవేశం, ముండన సంస్కారం వంటి పనులు ధనుర్మాసంలో చేయరు. అలాంటి సమయంలో ఎవరికైనా వార్షికోత్సవం లేదా పుట్టినరోజు వస్తే ఘనంగా జరుపుకోవచ్చా లేదా అనే సందేహం వ్యక్తం అవుతోంది
ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ జ్యోతిష్య శాస్త్ర పండితులు అనీష్ వ్యాస్.. మత విశ్వాసాల ప్రకారం ధనుర్మాసంలో శుభ కార్యాలు నిర్వహించరు. ఈ సమయంలో పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం వంటి సందర్భాలను జరుపుకోవచ్చు, దీనిపై శాస్త్రాలలో ఎటువంటి నిషేధం లేదు.
పుట్టినరోజు లేదా ఏదైనా ప్రత్యేక రోజు ఉంటే ఈ సందర్భాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. పార్టీ అనేది వ్యక్తిగత ఆనందం.. వీటిని సంస్కారాలుగా పరిగణించరు. అందువల్ల వీటిని నిషేధించలేదు
ధనుర్మాసంలో సాత్వికంగా వేడుకలు జరుపుకోండి కానీ ఆర్భాటాలకు పోవద్దు. ముఖ్యంగా మద్యం, మాంసాహారం తీసుకోకండి. ధనుర్మాసంలో కొత్త వ్యాపార ప్రారంభోత్సవం లేదా పార్టీలు చేయవద్దు.
పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం వంటి శుభ సందర్భాలను శుభంగా మార్చుకోవడానికి మీరు ఉదయాన్నే లేచి పూజలు చేయవచ్చు. గోసేవ, అన్నదానం , దీపదానం చేయవచ్చు. గౌరవప్రదమైన వేడుకను నిర్వహించడం ద్వారా మీరు మీ ప్రత్యేక రోజును మరింత శుభంగా చేసుకోవచ్చు.