Tiranga Yatra in Lucknow: లక్నోలో 'భారత్ శౌర్య తిరంగ యాత్ర'లో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్
మే 14 బుధవారం లక్నోలో జరిగిన భారత్ శౌర్య తిరంగ యాత్రలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు
నినాదాలు చేస్తూ జాతీయ జెండా చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. కాళిదాస్ మార్గ్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం నుంచి ప్రారంభమై 1090 చౌరాహా వరకు కొనసాగింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ను విజయవంతంగా ప్రారంభించిన భారత సాయుధ దళాల పరాక్రమాన్ని గౌరవించేందుకు ఈ యాత్ర నిర్వహించబారు
ఈ కార్యక్రమంలో పాల్గొని ఓ సభలో ప్రసంగించిన సీఎం యోగి, ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారత సాయుధ దళాలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మౌనంగా ఉండడాన్ని యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్రంగా ఖండించారు
పహల్గామ్ దాడిపై ఉగ్రవాదానికి మద్దతుదారులు, సూత్రధారులు మౌనంగా ఉన్నారు కానీ భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో మొదటి రోజు నుంచి అద్భుతమైన సమాధానం ఇచ్చింది అని ఆయన అన్నారు.
లక్నోలో నిర్వహించిన భారత్ శౌర్య తిరంగ యాత్రలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్