Hansika Motwani: శారీలో హన్సిక... యాపిల్ బ్యూటీ మరింత సన్నగా మారిందా?
Hansika Motwani Instagram Photos: హన్సిక ను తెలుగు ప్రేక్షకులు యాపిల్ బ్యూటీ అనేవాళ్ళు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జంటగా ఆవిడ నటించిన 'దేశ ముదురు' ఎఫెక్ట్ అటువంటిది. (Image Courtesy: ihansika / Instagram)
తెలుగులోకి హన్సిక కథానాయికగా అడుగుపెట్టారు. ఆవిడ హీరోయిన్. అయితే ఇప్పుడు సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నారు. టీవీ షోలలో ఎక్కువగా సందడి చేస్తున్నారు. (Image Courtesy: ihansika / Instagram)
ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో హన్సిక జడ్జ్ కింద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ టీవీ షో కోసం ఆవిడ ఇలా శారీలో సందడి చేశారు. ఈ ఫోటోలు చూసి ఆవిడ మరింత సన్నగా మారిందా? అని ఆడియన్స్ అంటున్నారు. (Image Courtesy: ihansika / Instagram)
హన్సిక మొత్వానికి పెళ్లయింది. పెళ్లి తర్వాత కూడా ఆవిడ సినిమాలలో నటిస్తున్నారు. కొన్నేళ్ల క్రిందట హీరోయిన్లకు పెళ్లి అయితే యాక్టింగ్ కెరియర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లయిన హీరోయిన్లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందాల భామలు కూడా సినిమాలు చేస్తున్నారు. (Image Courtesy: ihansika / Instagram)
తెలుగులో కంటే తమిళంలో హన్సికకు ఎక్కువ పాపులారిటీ వచ్చింది. కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేశారు. ఇప్పుడు అక్కడ కూడా ఆవిడ హవా తగ్గింది. (Image Courtesy: ihansika / Instagram)
హన్సిక మొత్వానీ లేటెస్ట్ శారీ ఫోటోలు (Image Courtesy: ihansika / Instagram)