Tamil Nadu Rain Alert: తమిళనాడులో కుంభవృష్టి.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురిశాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
చెన్నై సహా తీర ప్రాంత జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిని వర్షాలు ముంచెత్తాయి.
పుదుచ్చేరిలో గురువారం ఉదయం 8.30 నుంచి మధ్యహ్నం 1 గంట వరకు 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వీలైనంత వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా చెన్నై సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.
రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
సహాయక చర్యలను ముమ్మరం చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు.
చెన్నై సహా పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
వర్షాల ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.