✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Surya Tilak: బాల రాముడి నుదుటిన సూర్య తిలకం, ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది?

Ram Manohar   |  17 Apr 2024 01:29 PM (IST)
1

అయోధ్య రామ మందిరంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాముడి నుదుటిన సూర్య తిలకం దర్శనమిచ్చింది. దాదాపు మూడు నిముషాల పాటు సూర్య కిరణాలు రాముడి నుదురుపై ప్రసరించాయి. ఈ ఘట్టాన్ని చూసి ఆలయమంతా ఒక్కసారిగా జై శ్రీరామ్ నినాదాలతో మారు మోగింది.

2

శ్రీరామ నవమికి ఈ అపూర్వ ఘట్టాన్ని అందరి ముందు ఉంచింది ఆలయ ట్రస్ట్. సరిగ్గా మధ్యాహ్నం 12.01 నిముషాలకు సూర్య కిరణాలు రాముడి నుదుటిపై పడ్డాయి. ఆ సమయంలో పూజారులు రామయ్యకి ప్రత్యేక హారతి ఇచ్చారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ ఘట్టం విజయవంతంగా ముగిసింది.

3

వచ్చే ఏడాది శ్రీరామ నవమికి ఈ సూర్య తిలక దర్శనం ఉంటుందని ట్రస్ట్ చెప్పింది. కానీ...ఆ తరవాత ఈ ఏడాదే ఇది ఉంటుందని ప్రకటించింది. 58 మిల్లీ మీటర్ల పరిమాణంలో సూర్య కిరణాలు బాల రాముడి నుదుటిపై ప్రసరించాయి. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడం వెనక సైంటిస్ట్‌ల శ్రమ ఉంది. ఇందుకోసం వాళ్లు స్పెషల్‌గా ఓ పరికరాన్ని తయారు చేశారు.

4

పది మంది సైంటిస్ట్‌లు కలిసి ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని సాధించారు. ఆప్టో మెకానికల్ సిస్టమ్ ఆధారంగా సరిగ్గా అనుకున్న సమయానికి సూర్య కిరణాలు రాముడిని తాకేలా చేశారు. ఈ ప్రక్రియకి సూర్య తిలక్ మెకానిజం అనే పేరు పెట్టారు. అద్దాలు, లెన్స్ సాయంతో ఈ మొత్తం వ్యవస్థను రూపొందించారు.

5

ఆలయ శిఖర భాగాన టిల్ట్ సిస్టమ్ అమర్చారు. అందులో పైప్‌లు ఏర్పాటు చేశారు. ఈ పైప్‌లలో నాలుగు అద్దాలు, నాలుగు లెన్స్ అమర్చారు. సూర్య కిరణాలు ఆలయ శిఖర భాగంలో తాకినప్పుడు అవి నేరుగా అద్దంపై పడి ప్రసారం చెందుతాయి. అక్కడి నుంచి నేరుగా రాముడి విగ్రహాన్ని తాకేందుకు మధ్యలో మెకానిజమ్‌ని రూపొందించారు.

6

రామ మందిరంలో బాల రాముడి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. ఆలయ శిఖరాన ఏర్పాటు చేసిన మొదటి అద్దాన్ని అడ్జస్ట్ చేసుకునే విధంగా వాలుగా ఉంటుంది. ఆ అద్దం మీదుగా సూర్య కిరణాలు ఉత్తరం వైపు ప్రసరిస్తాయి. పైన ఉన్న అద్దం సూర్యుని కిరణాలు గ్రహించి వాటిని రెండో అద్దంవైపు మళ్లిస్తాయి. అలా ఒక అద్దం నుంచి మరో అద్దానికి లెన్స్ ద్వారా కిరణాలు ప్రసరిస్తాయి.

7

చివరలో ఉన్న అద్దం, లెన్స్ పై నుంచి వచ్చిన సూర్య కిరణాలను గ్రహించి సరిగ్గా రాముడి నుదుటిపై పడేలా చేస్తాయి. ఇలా ప్రతి శ్రీరామ నవమికి సూర్య తిలకం దిద్దేలా ఈ వ్యవస్థను రూపొందించింది ట్రస్ట్. బెంగళూరుకి చెందిన ఓ కంపెనీ సైంటిస్ట్‌లకు టెక్నికల్ సపోర్ట్ అందించింది. అలా ఇది సాధ్యమైంది.

8

ఈ సిస్టమ్‌లోని పైప్‌లను ఇత్తడితో తయారు చేశారు. అలా అయితే ఎక్కువ కాలం అవి మన్నికగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సూర్య తిలకం దర్శనానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదో అద్భుతం అంటూ భక్తులంతా పరవశించిపోతున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • న్యూస్
  • Surya Tilak: బాల రాముడి నుదుటిన సూర్య తిలకం, ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.