అయోధ్య బాల రాముడికి దివ్యాభిషేకం, 500 ఏళ్ల తరవాత అక్కడ రామనవమి వేడుకలు
500 వందల ఏళ్ల కల సాకారమై అయోధ్యలో బాల రాముడి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ఆలయాన్ని ప్రారంభించారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు రామ్ లల్లాని దర్శించుకున్నారు. ఆలయం తెరుచుకున్న తరవాత తొలిసారి అక్కడ రామనవమి వేడుకలు జరుగుతుండడం విశేషం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ వేడుకలు కళ్లారా చూసేందుకు దేశ నలుమూలల నుంచి రామ భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల తాకిడిని ముందుగానే ఊహించిన ట్రస్ట్ అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించింది. రామనవమిని దృష్టిలో ఉంచుకుని దర్శన వేళల్నీ పొడిగించినట్టు ట్రస్ట్ వెల్లడించింది.
ఈ వేడుకల కోసం బాల రాముడిని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు పూజారులు. పసువు వర్ణ దుస్తులతో రామయ్య మెరిసిపోతున్నాడు. విగ్రహం అంతా పూలతో అందంగా అలంకరించారు. ఈ అలంకరణతో బాల రాముడి అందం మరింత పెరిగింది. భక్తులకు ఇవాళ మరింత ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నాడు రాముడు.
రామ నవమి సందర్భంగా పూజారులు బాల రాముడికి దివ్యాభిషేకం చేశారు. పంచామృతాలతో అభిషేకించారు. ప్రత్యేకంగా 56 రకాల భోగ ప్రసాదాలు తయారు చేయించారు. వీటినే చప్పన్ భోగ్ అంటారు. ఏప్రిల్ 19 వరకూ ప్రత్యేక పూజలు, దర్శనాలు కొనసాగుతాయని ట్రస్ట్ స్పష్టం చేసింది.
ఈ వేడుకల్లో పాల్గొనేందుకు దాదాపు 25 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. మరో మూడు రోజుల పాటు అయోధ్య ఆలయం ఇలాగే కిక్కిరిసిపోతుందని భావిస్తున్నారు. ఎంత మంది వచ్చినా దర్శననానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్కింగ్ సౌకర్యాన్నీ కల్పించారు.
అయోధ్యకి వచ్చే ఫ్లైట్స్‌కీ ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దాదాపు 90 విమానాలు వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు భక్తులతో ల్యాండ్ కానున్నాయి. దాదాపు 14 నగరాల నుంచి అయోధ్యకి నేరుగా సర్వీస్‌లు నడుపుతున్నారు. రోజుకి కనీసం 10-12 ఫ్లైట్స్ షెడ్యూల్ చేసేందుకు ఆయా సంస్థలు ప్లాన్ చేసుకుంటున్నాయి.
ప్రత్యేక పూజలతో పాటు ఈ సారి సూర్య అభిషేకం కనువిందు చేయనుంది. బాల రాముడి నుదుటిపైనా తిలకంగా సూర్యుడు మెరవనున్నాడు. నిజానికి వచ్చే ఏడాది భక్తులు ఈ దృశ్యాన్ని చూడొచ్చిన చెప్పిన ట్రస్ట్ ఈ రామనవమికే చూసి తరించండి అని భక్తులకు శుభవార్త చెప్పింది.
ప్రధాని నరేంద్ర మోదీ రామనవమి శుభాకాంక్షలు చెబుతూ X వేదికగా ఓ పోస్ట్ చేశారు. అయోధ్య రాముడు దేశాభివృద్ధికి ప్రతీక అని వెల్లడించారు. ప్రత్యేకంగా ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. కోట్లాది మంది భారతీయులు ఈ క్షణం కోసమే ఎదురు చూశారని అన్నారు. అందరిపైనా రాముడి కృప ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.