Uber New Boat Service n Dal Lake: శ్రీనగర్ దాల్ సరస్సులో ఉబెర్ షికారా రైడ్స్ ప్రారంభం
శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో షికారా బోటు రైడింగ్ చెయ్యడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఈ షికారా బోటు రైడింగ్ బుకింగ్ పద్ధతిని పర్యటకులకు సులభతరం చేసేందుకు ఉబెర్ తొలిసారి కశ్మీర్ లోని జలరవాణా రంగంలో అడుగుపెట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం దాల్ సరస్సులో ఏడు బోట్లను అందుబాటులోకి తెచ్చిన ఉబర్, ఈ సేవల ద్వారా కశ్మీర్ టూరిజం రంగానికి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, మరిన్ని వాటర్ బోట్లను ప్రవేశపెట్టడమే కాకుండా, కశ్మీర్ లోని ఇతర సరస్సు లకు కూడా ఈ సేవలను విస్తరించేందుకు ఉబర్ సిద్ధంగా ఉంది.
ఏడాది పొడవునా దాల్ సరస్సులో బోటు రైడర్లు టూరిస్టులను షికారా యాత్రకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. దాల్ సరస్సు చుట్టూ ఉన్న జబర్వాన్ పర్వతశ్రేణి, పీర్ పంజల్ పర్వతశ్రేణి అందాలను వీక్షిస్తూ టూరిస్టులు ఈ యాత్రకు కొనసాగిస్తారు.
దాల్ సరస్సుపై ఉన్న బోట్ హౌసెస్ లో కూడా వసతి సౌకర్యాలు ఉంటాయి. సరస్సు చుట్టూ ఉన్న పర్వత శ్రేణి అందాలను వీక్షించ వచ్చు. సాధారణంగా దాల్ సరస్సు పరిసరాల్లో షికారా చేయాలంటే ఒక్క గంటకు రూ. 800- 1000 వరకు ఛార్జ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఉబెర్ ద్వారా కూడా పర్యాటకులు బుకింగ్ చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా, ఉబెర్ ఇప్పటికే టర్కీ బోస్ఫరస్ స్ట్రైట్, క్రొయేషియా తీరప్రాంతాలు, దుబాయ్ క్రీక్ వంటి ప్రదేశాల్లో బోటు సేవలను విజయవంతంగా నిర్వహిస్తోంది.
భారతదేశంలో నీటి మార్గాల వినియోగం తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, ఉబర్ వంటి సంస్థలు అడుగుపెడితే టూరిజం రంగానికి కొత్త ప్రోత్సాహం లభించవచ్చు. ప్రత్యేకించి డల్ సరస్సు వంటి పర్యాటక ప్రదేశాల్లో, ఉబెర్ సేవలు పర్యాటకులకు సులభతరమైన అనుభవాన్ని అందించగలవు.
ఇవి కేవలం పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే కాకుండా, స్థానిక బోటు యజమానులకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తాయి. సరసమైన ధరలతో మెరుగైన సేవలను అందించడం ద్వారా, నీటి మార్గాలు రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలుగా నిలుస్తాయి.
ముంబైలో గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలీఫెంటా గుహలు, ఆలిబాగ్ వరకు ఉబెర్ 2019 లో ఫెర్రీ సేవలు ప్రారంభించినప్పటికీ దానికి తగిన స్పందన లేకపోవడం తో తాత్కాలికం గా నిలిపి వేసింది. అయితే తాజాగా కేరళ బ్యాక్వాటర్స్ వంటి ప్రాంతాల్లో సేవలను ప్రవేశపెట్టేందుకు ఉబర్ ఆలోచిస్తోంది. ఈ సేవలు పర్యాటకులకు కొత్త అనుభవాన్ని అందించడం మాత్రమే కాకుండా, స్థానికులకు జీవితోపాధిని కల్పించగలవు.