Diwali 2022: సైనిక శిబిరాల్లో ఆనంద దీపావళి చూశారా!
మనందరినీ రక్షించడానికి, దేశ సరిహద్దులో మోహరించిన సైనికులు కూడా ఉన్నతాధికారులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. జవాన్లు మిఠాయిలు, భిన్నమైన వంటకాలతో పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో అధికారులు పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదీపావళి వైభవంగా జరుపుకున్నారు. దీపావళి రోజున చాలా మంది సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ రక్షణకు శ్రమిస్తున్నారు. దీపావళి మనమంతా ప్రశాంతంగా జరుపుకోవడానికి సైనికులే కారణం. ఆయా శిబిరాల్లోనే సైనికులు కూడా దీపావళి జరుపుకున్నారు.
సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, జనరల్ మనోజ్ పాండేతో సహా సాయుధ దళాల ఉన్నతాధికారులు సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.
రక్షణ అధికారుల ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారులందరూ వివిధ సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. జవాన్లను ఉత్సాహపరిచేందుకు వారితో దీపావళి జరుపుకున్నారు.
సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకోగా, సిక్కిం సెక్టార్లో సైనికులతో కలిసి జనరల్ పాండే దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
సిక్కింలోని ఎల్ఏసీ సమీపంలో సైనికులతో కలిసి భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్న సైనికులను జనరల్ పాండే ప్రశంసించారు.
సిడిఎస్ అనిల్ చౌహాన్ తో సహా ఉన్నతాధికారులు జవాన్లతో కలిసి దీపావళి జరుపుకోవడంతో సరిహద్దు దళాల ఉత్సాహం నాలుగు రెట్లు పెరిగింది.
దీపావళి రోజున వారి కుటుంబాలకు దూరంగా ఉంటున్నామన్న భావన రాకుండా చేశారు. అధికారులు కలిసి మిఠాయిలు తిన్నప్పుడు, సైనికులను పలకరించినప్పుడు వారి బాధను మర్చిపోయారు. అందరి ముఖాలు సంతోషంగా కనిపించాయి.