Sidhu Moose Wala Murder: వివాదాస్పద సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య వెనుక ఉన్నది ఎవరు?
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. (Source ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమూసేవాలా ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను తుపాకీతో కాల్చిచంపారు. (Source ANI)
ఈ ఘటనలో మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. (Source ANI)
వీఐపీ సంస్కృతికి తెరదించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. (Source ANI)
ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. (Source ANI)
తన పాటల్లో ఎక్కువగా గన్ కల్చర్, గ్యాంగ్‌స్టర్లు వంటి హింసను ప్రేరేపించేవి చూపించే వివాదాస్పద గాయకుడిగా నిలిచాడు. (Source ANI)
మూసేవాలా మృతి పట్ల వివిధ పార్టీలకు చెందిన నేతలు విచారం వ్యక్తం చేశారు. (Source ANI)
ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (Source ANI)
ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేశారు భగవంత్ మాన్. (Source ANI)
ఈ హత్య వెనక లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ హస్తం ఉందని పంజాబ్ డీజీపీ వీకే భావ్రా వెల్లడించారు. (Source ANI)
కెనడాలో ఉండే లారెన్స్ గ్యాంగ్ సభ్యుడైన లక్కీ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడని తెలిపారు. (Source ANI)
సిద్ధూ పాడిన 'బంబిహ బోలే', '47' పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. (Source ANI)