Manmohan Singh Funeral: మన్మోహన్ సింగ్‌కు తుది వీడ్కోలు, అధికారిక లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు
Shankar Dukanam
Updated at:
28 Dec 2024 01:30 PM (IST)

1
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర నిర్వహించారు. మన్మోహన్ అంతిమయాత్రలో భారీగా తరలివచ్చి పాల్గొన్నారు.

3
యావత్ భారతావని మన్మోహన్ అందించిన సేవల్ని కొనియాడుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, తన విధానాలతో భారత్‌ను ఆర్థిక మాంద్యం గండం నుంచి గట్టెక్కించిన ఘనత ఆయన సొంతం.
4
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని నేటి ఉదయం తరలించారు. సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ నేతలు ఘన నివాళులర్పించారు.