Puri Temple : నేడు ఒడిశాలోని జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం
నేడు ఒడిశాలోని జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజగన్నాథ్ హెరిటేజ్ కారిడార్‌కు శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ అని పిలుస్తారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రారంభిస్తారు.
ఈ కారిడార్ ప్రారంభ వేడుక కోసం మకర సంక్రాంతి రోజు నుంచి మహాయాగం కొనసాగుతోంది.
గజపతి మహారాజు దిబ్యాసింగ్ దేబ్ చేతుల మీదుగా పూర్ణాహుతితో యాగం ముగియనుంది.
800 కోట్ల వ్యయంతో జగన్నాథ ఆలయంలోని మేఘనాథ్ పచేరీ చుట్టూ భారీ కారిడార్ నిర్మించారు.
ఈ కారిడార్ వల్ల ఒక క్రమపద్ధతిలో ఆలయాన్ని భక్తులు సందర్శించేందుకు వీలు కలుగుతుంది.
పూరీలోని జగన్నాథ కారిడార్ ప్రారంభోత్సవం రోజున అంటే ఇవాళ ఒడిశా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.
ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంగా భారీగా భక్తులు పూరీకి తరలి వస్తున్నారు.