Ram Mandir: అయోధ్య రాముడి కోసం అరుదైన కానుకలు - విదేశాల నుంచి కూడా
సూరత్‌కి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రామ మందిరం థీమ్‌తో ఓ నెక్లెస్ తయారు చేశారు. 5 వేల అమెరికన్ వజ్రాలతో తయారు చేసిన ఈ నెక్లెస్‌ని రామ మందిరానికి కానుకగా అందించారు. 35 రోజుల పాటు శ్రమించి 40 మంది కళాకారులు దీన్ని తయారు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయూపీలో ఎతా జిల్లా గంటల తయారీకి చాలా ఫేమస్. అయోధ్య రాముడి ఆలయానికీ ఇక్కడే భారీ గంటను తయారు చేశారు. 2,100 కిలోల బరువు, ఆరడుగులు ఎత్తున్న ఈ గంట తయారీకి రూ.21 లక్షలు ఖర్చయ్యాయి. ఈ గంటను ఆలయానికి కానుకగా ఇచ్చారు.
ఓ కూరగాయల వ్యాపారి అరుదైన భారీ గడియారాన్ని అయోధ్యకి కానుకగా ఇచ్చాడు. ఇందులో ఒకేసారి 8 దేశాల టైమింగ్స్‌ని చూసుకోవచ్చు. ఈ గడియారాన్ని తయారు చేసేందుకు రూ.3 వేలు ఖర్చైందట.
యూపీలోని అలీగఢ్‌ని లాక్ సిటీగా పిలుస్తారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ జంట 400 కిలోల తాళాన్ని తయారు చేశారు. అయోధ్య ఆలయానికి కానుకగా ఇచ్చారు. నాలుగున్నర అడుగుల పొడవున్న ఈ తాళం తయారీకి రూ.2 లక్షలు ఖర్చయ్యాయి.
నేపాల్ వాసులూ అయోధ్య ఉత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా సీతమ్మవారు నేపాల్‌లోనే పుట్టారని విశ్వసిస్తారు. అందుకే అక్కడి ప్రజలు ఈ ఉత్సవానికి దాదాపు 1,100 బుట్టలు కానుకగా అందించి భక్తి చాటుకున్నారు.
గుజరాత్‌లోని వడోదరకు చెందిన రామ భక్తులు అయోధ్య రాముడి కోసం 108 అడుగులు అగరుబత్తిని తయారు చేశారు. ఓ రైతు ఈ దీన్ని తయారు చేయించాడు. 3,500 కిలోల బరువున్న ఈ అగరుబత్తిని అయోధ్యకు కానుకగా అందించాడు.
పట్నాకి చెందిన మహావీర్ టెంపుల్ ట్రస్ట్ అయోధ్య రాముడి కోసం బంగారు విల్లు, బాణం తయారు చేయించింది. వీటిని కానుకగా అందజేయనుంది. అంతే కాదు. ఆలయ నిర్మాణం కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చింది.
వీటితో పాటు థాయ్‌లాండ్ మట్టితో పాటు నీళ్లను కానుకగా పంపింది. శ్రీలంక అశోక్ వాటిక రాయిని కానుకగా ఇచ్చింది.