Independence Day 2025 : స్వాతంత్య్రం తరువాత భారత్కి, పాకిస్తాన్కి సైనికులను ఎలా విభజించారో తెలుసా?
స్వాతంత్య్ర విభజన తర్వాత సైన్యాన్ని, ఆర్థిక విభజన కోసం పంజాబ్ విభజన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సైన్యాన్ని భారత్కి, పాకిస్తాన్కి ఎలా విభజించారో తెలుసా?
ఆగస్టు 14, 1947న పాత భారతీయ సైన్యాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై ఆచిన్లేక్, మేజర్ జనరల్ రెజినాల్డ్ సేవరి సంతకం చేశారు. ఇది బ్రిటిష్ సైన్యం ఇచ్చిన చివరి ఉత్తర్వు.
సైనికులకు తమ ఇష్టానుసారం భారతదేశం లేదా పాకిస్తాన్ను ఎంచుకోవచ్చని చెప్పారు. కానీ షరతు ఏమిటంటే పాకిస్తాన్కు చెందిన ఏ ముస్లిం అయినా భారతదేశంలో.. భారతదేశానికి చెందిన ఏ ముస్లిమేతర వ్యక్తి అయినా పాకిస్తాన్ సాయుధ దళాలల్లో మాత్రం చేరకూడదు.
బ్రిటన్ నేషనల్ ఆర్మీ మ్యూజియం నివేదిక ప్రకారం.. విభజన తరువాత మూడింట రెండు వంతుల సైనికులు భారతదేశానికి, మూడింట ఒక వంతు పాకిస్తాన్కు వెళ్లారు.
ఈ విధంగా 2,60,000 మంది సైనికులు భారత సైన్యాన్ని, దాదాపు 1,40,000 మంది పాకిస్తాన్ను ఎంచుకున్నారు. పాకిస్తాన్ ఎంచుకున్న వారిలో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు.
నివేదికల ప్రకారం 98 శాతం మంది ముస్లిం సైనికులు పాకిస్తాన్ వెళ్లారు. అయితే కేవలం 554 మంది ముస్లిం అధికారులు మాత్రమే భారతదేశాన్ని ఎంచుకుని ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.
విభజన సమయంలో భారత సైన్యంలో దాదాపు 36 శాతం ముస్లింలు ఉండగా.. అది 2 శాతానికి తగ్గింది. సైన్యాన్ని విభజించిన తరువాత రెండవ అతిపెద్ద సమస్య ఆర్థిక వనరులను విభజించడంలో వచ్చింది.