INS Vikrant Photos: ఐఎన్ఎస్ విక్రాంత్ నాల్గో దశ ట్రయల్స్ గ్రాండ్ సక్సెస్ - ఆగస్టు 15న రంగంలోకి
స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ నాల్గో దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. కొన్ని ఏవియేషన్ ఫెసిలిటీస్ కాంప్లెక్స్ పరికరాలతో సహా ఆన్‌బోర్డ్‌లోని మెజారిటీ పరికరాలతో పూర్తి స్థాయిలో ట్రయల్స్ నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిక్రాంత్ జూలై 22న డెలివరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. స్వాతంత్య్రం సాధించుకుని 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించనున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' లో భాగంగా ఈ ఆగస్టు నెలలో స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్‌ను ప్రారంభించేందుకు అంతా సిద్ధమైంది.
ఇండియన్ నేవీ మరియు కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ విక్రాంత్‌ను రూపొందించింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నిర్మాణంలో 76% కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానం వినియోగించడం ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్’ లో గొప్ప ప్రగతికి నిదర్శనం.
స్వదేశీ టెక్నాలజీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ రూపొందించడంతో పెద్ద సంఖ్యలో అనుబంధ పరిశ్రమల అభివృద్ధితో పాటు 2000 మంది సీఎస్ఎల్ సిబ్బందికి, మరో 12000 మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించింది.
ఆగస్ట్ 2021లో తొలిసారి ట్రయల్స్ నిర్వహించి సక్సెస్ అయింది. ఆపై అదే ఏడాది అక్టోబరులో, ఈ ఏడాది జనవరిలో వరుసగా రెండవ, మూడవ దశలలో సముద్రంలో ట్రయల్స్ నిర్వహించారు.
ఈ మూడు దశల ట్రయల్స్‌లో ప్రొపల్షన్ మెషినరీ, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ సూట్‌లు, డెక్ మెషినరీ, లైఫ్ సేవింగ్ అప్లయెన్సెస్, షిప్ నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ పని తీరును సమర్థవంతంగా టెస్ట్ చేశారు. దాంతో స్వదేశీ టెక్నాలజీ విక్రాంత్‌పై మరింత నమ్మకం ఏర్పడింది.
ఈ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌ను దాదాపు రూ.23 వేల కోట్లతో రూపొందించారు. ఆగస్టు 15న ఆజాదీ కా కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇండియన్ నేవీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించనుంది.