World Most Expensive Fruit: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఇదే, కేజీ ధరతో లగ్జరీ కారు కొనొచ్చు

అత్యంత ఖరీదైన పండు మియాజాకి మామిడి కంటే ఈ పుచ్చకాయ ధర ఎక్కువ. కానీ ఇది మన దేశంలో సాగు చేసి, ట్రక్కులకు ట్రక్కుల లోడ్లు సరఫరా చేసే పుచ్చకాయ మాత్రం కాదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు యుబారి పుచ్చకాయ (Yubari Melon). ఈ కాస్ట్ లీ పండ్లను జపాన్ లో సాగు చేస్తారు. దీని ధర చాలా ఎక్కువ. యుబారి పుచ్చకాయను కొనే డబ్బుతో మంచి లగ్జరీ కారు కొనుక్కోవచ్చు.

యుబారి మెలాన్ చాలా ఖరీదైనప్పటికీ, ఈ పుచ్చకాయకు మంచి డిమాండ్ ఉంది. జపాన్ తో పాటు కొన్ని దేశాల్లో ధనవంతులు ఈ పండును ఎంతో ఇష్టంగా కొనుక్కుని తింటారు.
యుబారీ పుచ్చకాయ ధర వింటే దిమ్మతిరుగుతుంది. ఒక కేజీ Yubari Melon కొనాలంటే రూ. 20 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇవి కేవలం జపాన్‌లో మాత్రమే సాగు చేస్తారు.
ఈ ఖరీదైన పుచ్చకాయను తింటే డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ పండు దోహదం చేస్తుంది. రక్తపోటు (బీపీ) తగ్గుతుంది.