Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Priti Adani: గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ ఏం చదువుకున్నారో తెలుసా?
భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేరు అందరికీ తెలిసినా... ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం తెలిసింది కొందరికే
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొంత కాలం క్రితం అదానీ గ్రూప్ గొప్ప విజయాలు సాధించినప్పుడు ఆ విజయం వెనుకన్నవారిలో గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానికి నాల్గవ వంతు క్రెడిట్ ఇచ్చారు.
1965లో ముంబైలో గుజరాతీ కుటుంబంలో జన్మించిన ప్రీతి అదానీ అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ నుంచి డెంటల్ సర్జన్ పట్టా పొందారు. గౌతమ్ అదానీని వివాహం చేసుకున్న తర్వాత 1996లో ప్రీతి అదానీ.. అదానీ ఫౌండేషన్‌కు ఛైర్ పర్సన్ గా మారారు.
అదానీ గ్రూప్‌ను నిర్వహించడమే కాకుండా, పేదల కోసం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.
ప్రీతి అదానీ 1966లో కేవలం ఇద్దరు టీమ్ సభ్యులతో అదానీ ఫౌండేషన్‌ని స్థాపించారు. 21 ఏళ్లలోనే ఆ ఫౌండేషన్ ను దేశంలోని 18 రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రాంతాలకు సేవలను విస్తరించారు.
ప్రీతి అదానీ దాతృత్వ కార్యక్రమాలు, సామాజిక సేవను కొత్త స్థాయికి తీసుకెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదు.
2010-11లో ఫ్లో ఉమెన్ ఫిలాంత్రోపిస్ట్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఎంతో మందికి ప్రేరణను ఇచ్చారు. తన అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా మిలియన్ల మంది ప్రజల జీవితాలను మార్చారు.