Dandruff : చలికాలంలో చుండ్రును పెంచే కారణాలివే.. పట్టించుకోకుంటే జుట్టు కూడా రాలిపోతుందట
పొడి చర్మం కారణంగా తరచుగా తలపై దురద వస్తుంది. చుండ్రు పెరుగుతుంది. జుట్టు రాలుతుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చని దుస్తులతో కప్పుకుంటాము.. కానీ స్కాల్ప్‌ను పొడిగాలుల నుంచి కవర్ చేయము.
జుట్టును సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల చుండ్రు పెరుగుతుంది. పైగా కొందరు చలికాలంలో తక్కువగా తలస్నానం చేస్తారు. దీనివల్ల స్కాల్ప్‌లో మురికి, నూనె పేరుకుపోతుంది. ఇది చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ పెంచుతుంది.
మాలసేజియా అనే ఫంగస్ చనిపోయిన చర్మం, పేరుకుపోయిన నూనెపై పెరుగుతుంది. ఒకటి రెండు రోజుల వ్యవధి పర్లేదు కానీ.. కొందరు వారానికి ఒకసారి కూడా తలస్నానం చేయరు. వైద్యులు ప్రతి రెండు రోజులకు ఒకసారి తేలికపాటి లేదా చుండ్రు నిరోధక షాంపూని ఉపయోగించమని సలహా ఇస్తున్నారు.
రెండవ ప్రధానమైన తప్పు ఏమిటంటే.. స్ట్రాంగ్ ప్రొడెక్ట్స్ ఉపయోగిస్తారు. కఠినమైన షాంపూలు, ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులు స్కాల్ప్ తేమను లాగేస్తాయి. ఇది చికాకు, వాపును పెంచుతాయి. దీని వలన చుండ్రు మరింత తీవ్రమవుతుంది.
ఒత్తిడి కూడా చుండ్రుకు ఒక ప్రధాన కారణం. చాలా మంది సెలవుల్లో ఉపశమనం పొందుతారు. కానీ బ్రేక్ తర్వాత మళ్లీ అదే కొనసాగుతుంది. దీనివల్ల ఒత్తిడి పెరిగి కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఇది స్కాల్ప్‌లో వాపును కలిగిస్తుంది.
దురద వచ్చినప్పుడు పదేపదే గోకడం కూడా హానికరం. దీనివల్ల చర్మం సున్నితంగా మారి చుండ్రు పెరిగే అవకాశం ఉంది. చర్మాన్ని ముఖ చర్మంలా సున్నితంగా భావించి తేలికపాటి జాగ్రత్తలు తీసుకోవాలి.
జుట్టులో చుండ్రు ఒక చర్మ సమస్య. ఇది తరచుగా సెబోరోయిక్ చర్మశోథతో ముడిపడి ఉంటుంది. తప్పు జుట్టు సంరక్షణ, పేలవమైన ఆహారం, జీవనశైలి దీనికి కారణం కావచ్చు. సమస్య కొనసాగితే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం అవసరం.